మెరిసే కురులు.. మీ సొంతం


Mon,January 7, 2019 11:33 PM

ఈ రోజుల్లో ప్రతిఒక్కరికి జుట్టు అధికంగా రాలిపోతుంది. ఏం చేసినా.. ఎటువంటి ఫలితాలు కనిపించలేదని బాధపడుతున్నారా.. అయితే ఈ కింది చిట్కాలను పాటిస్తే పట్టుకుచ్చులా మెరిసే కురులు మీ సొంతమవుతాయి.
HAIR_CARE
-తెల్ల వెంట్రుకలు ఉంటే వాటికి రంగువేస్తుంటారు. రంగు వేసి వదిలేస్తే సరిపోదు వాటికి తగ్గకొన్ని పనులు చేయాలి. జట్టుకు రంగు ఆరిపోగానే తలస్నానం చేయాలి. ఆ తరువాత బీట్‌రూట్, క్యారెట్ రసాలను కండీషనర్‌లా తలకు పట్టిస్తే చాలు.
-పెసరపప్పు పిండి, మెంతిపిండిని బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 50 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే కురులు అందంగా మెరిసిపోతాయి.
-కరివేపాకును బాగా ఎండబెట్టి పొడిని బాటిల్‌లో నిల్వ ఉంచాలి. మజ్జిగలో ఈ పొడిని కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే జుట్టు పట్టుకుచ్చులా పెరుగుతుంది.
-మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత ఒక అరటిపండు తినడం అలవాటుగా మార్చుకోవాలి. అరటిలోని పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.
-కొబ్బరినూనెలో తమలపాకు రసం కలుపాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు రాసి కొంతసేపు మర్దన చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే రక్తప్రసరణ జరిగి కుదుళ్లు దృఢపడుతాయి.
-వాల్‌నట్స్‌ని దంచి మెత్తగా చేసి నీళ్లలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 60 నిమిషాల తరువాత తలస్నానం చస్తే జట్టు ముదురు ఎరుపు రంగుగా మారుతుంది.

681
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles