విద్యార్థులను మలిచి మార్గదర్శిగా నిలిచి


Tue,March 13, 2018 12:29 AM

కలలు అందరూ కంటారు.కొందరే సాకారం చేసుకుంటారు.కొందరి కలలు కలలుగా మిగిలిపోతాయి.ఇంకొందరి కలలు అలలొచ్చి ఆపినా ఆగవు.డాక్టర్ ప్రియాంక పీవీ కూడా కలలు కన్నది.వాటిని ఎలా సాకారం చేసుకున్నది? యువ ప్రొఫెసర్‌గా ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శిగా ఎలా ఎదిగింది?
my-parentss
Low aim is a crime.. నీ లక్ష్యం తక్కువదిగా, చిన్నదిగా ఉండడం నేరం అన్నారు అబ్దుల్ కలాం. ప్రియాంక అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నది. ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు. ప్రయత్నించడంలోనే ఓడిపోవద్దనుకున్నది. డాక్టర్ ప్రియాంక పీవీ యువ ప్రొఫెసర్. భిన్న పద్ధతిలో పాఠాలు చెప్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నది. ఈరోజుల్లో చెప్తే వినే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటున్నది. మరి విద్యార్థులకు ఆసక్తికరంగా చెప్పడం ఎలా? అని ఆలోచించి సరికొత్త బోధనా శైలిని రూపొందించింది ప్రియాంక. చెప్పాలనుకున్న విషయానికి టెక్నాలజీ జోడించి ఆ అంశాన్ని ఆసక్తికరంగా మార్చి చెప్తున్నది. బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లి అక్కడ కూడా పాఠాలు చెప్తున్నది ప్రియాంక.


ఉపాధ్యాయ వృత్తి సమాజం మీద ప్రభావం చూపగలిగినది. భవిష్యత్తు తరాలను మార్చేది. నేటి తరానికి దారి చూపేది. ఒక్క వ్యక్తి వేల మందిని ప్రభావితం చేసే అతితక్కువ రంగాల్లో ఈ రంగం ఒకటి. ప్రతిరంగంలో కష్టనష్టాలున్నట్లే ఈ వృత్తిలోనూ ఉంటాయి. వ్యక్తిగత విషయాలు ఎన్ని ఉన్నా పక్కన పెట్టి, విద్యార్థుల బంగారు భవిష్యత్తు మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పుడే వ్యక్తిగత జీవిత ప్రభావం ఆ విద్యార్థులపై పడదు. ఈ విషయాలన్నింటినీ ప్రియాంక పాటిస్తున్నది. తన జీవితంలో ఎన్ని కష్టాలున్నా.. పాఠాలు చెప్పేటప్పుడు మాత్రం నవ్విస్తూ చెప్తున్నది. అర్థమయ్యేలా వివరిస్తున్నది. లోపలెంత బాధ ఉన్నా.. బయటికి మాత్రం నవ్వుతూనే ఉన్నది. అందుకే ఈ రంగంలో ప్రియాంకకు పలు అవార్డులు కూడా లభించాయి. ప్రత్యేక గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. చాలామందికి నవ్వుతూ నవ్విస్తూ చదివించిన గురువులు ఎక్కువ రోజులు గుర్తుంటారు. ఎందుకంటే విద్యార్థులు ఆ గురువులను వేరేవాళ్ల కన్నా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి. ప్రియాంక విషయంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి.

భిన్నమైన శైలి..


అబెంగళూరుకు చెందిన ప్రియాంక ఇన్నోవేటివ్ టీచింగ్ ైస్టెల్ పేరుతో అనేక కార్యక్రమాలు చేస్తున్నది. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. దుబాయిలో జరిగిన రోచెస్టెర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెడ్ టాక్ కార్యక్రమంలో ప్రధాన వక్తగా వ్యవహరించింది. ఎంబీఏ చదివే విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహిస్తున్నది ప్రియాంక. భిన్నంగా ఆలోచించడం ద్వారానే సమాజంలో మనకు గుర్తింపు లభిస్తుంది అంటున్నది ప్రియాంక. తను ఏం చెప్పిన చిత్రాలు వేసి అర్థమయ్యేలా చెప్పడం మరో ప్రత్యేకత. ప్రియాంక వద్ద పాఠాలు విన్న చాలా మంది విద్యార్థులు ఇప్పుడు చాలా రంగాల్లో విజయం సాధించారు. తమదైన శైలిలో రాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యవస్థల్లో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రియాంక మనం రోజూ వాడే వస్తువులను ఉదాహరణగా చెప్తూ విషయాన్ని సూటిగా వివరిస్తున్నది. క్యాండీ క్రష్, టెంపుల్న్,్ర సోషల్‌మీడియాలోని పదాలను వాడుతూ హిందీ పాటలు పాడుతూ గ్లోబలైజేషన్ వంటి అంశాలను కళ్లకు కట్టినట్లు చెప్పడం ఆమె ప్రత్యేకత. కాలేజీ తరగతి గదుల్లోనే కాదు యూట్యూబ్‌లో కూడా ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నది ప్రియాంక.

వార్డులు..బాధ్యతలు


దుబాయ్‌లోని కర్టిన్ యూనివర్సిటీ ప్రియాంకను గుర్తించి అవార్డు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 జర్నల్స్‌కి రివ్యూయర్‌గా, ఎడిటోరియల్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు ప్రియాంక. ముఖ్యంగా విద్యార్థులు, వారు నేర్చుకోవాల్సిన అంశాల మీద అధ్యయనం చేసి చాలాచోట్ల ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతేకాదు ప్రియాంక సోషల్‌మీడియా అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్ ద ఇండియన్ రిటైల్ ఇండస్ట్రీ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాసింది.

Dr-Priyanka
ఈ పుస్తకాన్ని దేశంలో టాప్ పబ్లిషింగ్ సంస్థ ప్రచురించింది. విద్యారంగంలో కీలకంగా సేవలందిస్తున్నందుకు గానూ చాలా సంస్థలు అవార్డులను ఇచ్చాయి పలు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలు. జైన్ యూనివర్సిటీ 2017 అల్యుమినీ అవార్డు, ఎయిమ్స్ అవుట్ స్టాండింగ్ యంగ్ ఉమన్ మేనేజ్‌మెంట్ టీచర్ అవార్డు, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌లెన్స్ కర్ణాటక అవార్డులు ప్రియాంకకు లభించాయి. విద్యతో పాటు విద్యార్థులు సామాజిక సేవ చేయాలని కూడా చెప్తున్నది ప్రియాంక. వరల్డ్ విజన్ ఇండియా కోసం ఇద్దరు చిన్నారులను తన తరపున సిద్ధం చేస్తున్నది. దివ్యాంగులైన ఎంతోమంది విద్యార్థులను ఉచితంగా చదివిస్తున్నది.

735
Tags

More News

VIRAL NEWS