సహజసిద్ధమైన అందానికి..


Tue,March 13, 2018 01:57 AM

Face.jpg
ఎండాకాలం వచ్చిదంటే మేకప్ అవసరంలేని సహజసిద్ధ అందం కోసం మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే కాంతివంతమైన చర్మాన్ని ఈ చిట్కాల ద్వారా పొందవచ్చు.
-నిమ్మరసం ఆరోగ్యాన్ని రక్షించడంలో ముందుంటుంది. రెండు చెంచాల నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలిపి ముఖానికి మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
-టమోట ప్యాక్ ముఖంపై మృతకణాలను నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. రెండు టమోలు, రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి మిక్సీపట్టాలి. ఆ పేస్టును స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి.
-ఒక కప్పు పాలు(ఫ్యాట్ ఫ్రీ)లో ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి 20 నిమిషాల తర్వాత ముఖానికి పట్టించాలి. ఈ చిట్కాను వారానికి ఒకసారి పాటించాలి.
-ఎక్స్‌ఫోలియేషన్‌లో చక్కెర/ఉప్పు/ఓట్‌మీల్/క్రష్డ్ ఆల్మండ్స్ కలిపి దీని ప్యాక్ సిద్ధం చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై సున్నితంగా రాయాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్‌ను వాడితే మంచిది.
-స్నానం చేసిన తర్వాత కొబ్బరి నూనెను శరీరంపై పలుచగా రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చర్మం కాంతివంతంగా మారి.. రోజంతా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

515
Tags

More News

VIRAL NEWS

Featured Articles