వేడినీటితో లాభాలెన్నో..


Tue,March 13, 2018 01:52 AM

సాధారణంగా ఉదయం లేవగానే ... బ్రష్ చేసుకోగానే... కాఫీనో, టీనో తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. బ్రష్ చేయనిదే మంచినీరు కూడా ముట్టరు. కానీ ఉదయం లేవగానే వేడినీరు తాగితే కలిగే లాభాలేంటో మీకు తెలుసా?]\
warm-water

-ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగేవారిలో.. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. మలబద్దకం, పైల్స్ లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
-శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి, త్వరగా బరువు తగ్గుతారు.
-శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. శరీర అవాయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల జీవ ప్రక్రియలన్నీ... సజావుగా సాగుతాయి.
-దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు వేడినీరు తాగడం వల్ల మంచి ఉపశమనం పొందుతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
-వేడినీరు తాగడం వల్ల కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది.
-అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను తేనె, సగం నిమ్మ రసం కలిపి రోజూ... పరగడపునే తాగడం వల్ల మలబద్ధకం ,హైపర్ ఎసిడిటీకి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది.

779
Tags

More News

VIRAL NEWS

Featured Articles