ఈ రోబోల రూటే సెపరేటు!


Mon,February 12, 2018 11:10 PM

మానవజీవితం ఇప్పుడు యాంత్రికం. నడుస్తున్నది మరమనుషుల కాలం. అందుకే తనలాంటి మరో రూపాన్ని సృష్టించి.. యంత్రమనే గుండెసాయంతో ప్రాణం పోశాడు మనిషి. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతూ ఆ యంత్రుడికి మహోన్నత శక్తులను అందించేందుకు కొన్నేళ్లుగా కృషిచేస్తున్నాడు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలో తానే ఓ యంత్రుడిలా మారిపోయాడు. ఎన్నో విభిన్నమైన రోబోలను ఆవిష్కరించాడు. వాటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకటి మాట్లాడే రోబో అయితే, మరొకటి స్వతంత్రంగా వ్యవహరించే రోబో. ఇలా ఒకటేమిటి ఈ టెక్నాలజీ ప్రపంచంలో చాలా ప్రత్యేకతలున్న రోబోలే ప్రాణం పోసుకున్నాయి. అలాంటి రోబోల్లో అత్యంత శక్తివంతమైన వాటిని, వాటి విశేషాలను మీకు పరిచయం చేస్తున్నాం.
BIGG-ROBOT

snake-robot

స్నేక్ రోబో

పాములా మెలికలు తిరిగి ఉండే ఈ రోబో టెక్నాలజీ ప్రపంచంలో ఒక అద్భుతమే కాదు.. బలమైనది కూడా. ఏసీఎమ్- ఆర్5గా మార్కెట్‌లోకి దూసుకొచ్చిన ఈ రోబోను హైబోట్ అనే జపనీస్ కంపెనీ రూపొందించింది. విభిన్నంగా నిర్మితమైన దీని భాగాలు మనోహరంగాను, నీటిలో గింగిరాలు తిరుగుతూ అబ్బురపరిచేవిగానూ ఉంటాయి. బలమైన రోబోట్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ యంత్రతంత్రము.. అటు భూఉపరితల మీద, ఇటు నీటిలోనూ దూసుకుపోగలగడం విశేషం.

kurata-robot

కురట రోబో

రోబోటిక్స్ వరల్డ్‌లో కొన్ని ఆవిష్కరణలు కాల్పనికత కంటే దృఢంగా ఉంటాయి. ఈ భారీ స్థాయి కురట రోబోను చూస్తే.. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ట్రాన్స్‌ఫార్మర్స్, రియల్ స్టీల్‌లలో సందడి చేసిన మెషినరీలను నిజమేనని నమ్మాల్సిందే. జపనీస్ టెక్నాలజీతో కూడిన ఈ భారీ రోబోను స్యుడోబాషి హెవీ ఇండస్ట్రీ తయారు చేసింది. నాలుగు మీటర్ల ఎత్తుండే ఈ యంత్రుడి చేతిలో మెషిన్ గన్స్, రాకెట్‌లాంచర్స్ వంటి ప్రమాదకరమైన మారణాయుధాలు ఉంటాయి. దీని లోపల ఏర్పాటు చేసిన కాక్‌పిట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు, లేదంటే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయడం ద్వారా రిమోట్ ద్వారానూ పర్యవేక్షించవచ్చు. దీని స్పెషాలిటీస్ చూసి కొనుక్కోవాలనుకొంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే దీని ధర 1.35 మిలియన్ డాలర్ల పైమాటే.

occtovia

ఆక్టోవియా రోబో

యూఎస్ నావల్ రీసెర్చ్ లాబొరేటరీ రూపొందించిన మానవరూపిత యంత్రమిది. ముఖ కవళికలు మనిషిని పోలి ఉండడం విశేషం. ఆ దేశపు నౌకాదళంలోని ఇంజినీర్లకు ఫైర్‌ఫైటర్‌గా ఇది సాయం చేస్తుంది. ఇది మనుషులతో పరస్పరం సంభాషించగలదు, మనుషులను గుర్తించగలదు. మనుషులు చేపట్టే హానికారకమైన చర్యలను ట్రాక్ చేయగలదు. నౌకాదళంలోని ఇంజినీరింగ్ సభ్యులతో భుజం భుజం కలిపి పనిచేయడంలో ఇది మానవుడి మాదిరే పనిచేస్తుంది. మాట్లాడడం, దృశ్యవీక్షణం గుర్తించడం వంటి స్పెషాలిటీస్‌తో దృఢమైన రోబోట్స్‌లో ఒకటిగా హైలైట్ అయ్యిందీ ఆక్టోవియా.

swine-flu-robot
స్వైన్‌ఫ్లూ రోబోసాధారణంగా రోబో అనగానే అందరిలో ఒక యాంత్రికమైన నిర్మాణమే స్ఫురణకు వస్తుంది. కానీ ఇది కచ్చితంగా అలాంటి రోబో అయితే కాదు. ఇదొక మానవ వింత. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ రోబో స్వైన్‌ఫ్లూ లక్షణాలను అనుకరిస్తుంది. అదేంటి రోగంతో పుట్టిందా? అని ఆశ్చర్యపోవద్దు. జపాన్‌లోని ట్రైనీ డాక్టర్లకు స్వైన్‌ఫ్లూ (H1N1) గురించి ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా వీటిని తయారు చేశారట. అన్ని రోబోట్స్‌లా కాదు, ఇవి అచ్చం మనిషి శరీరాన్ని పోలిన బాహ్యనిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మనిషిలాగే వీటికి కూడా చెమటొస్తుంది. ఇవి ఏడుస్తాయి. బాధతో మెలికలు తిరిగిపోతాయి. సరైన చికిత్స అందకపోతే వీటి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది. కొన్ని క్లిష్టపరిస్థితుల్లో శ్వాస ఆగిపోయి చనిపోతాయి కూడా.

bigdog

బిగ్ డాగ్ రోబో

2005లో బోస్టన్ డైనమిక్స్ రూపొందించిన నాలుగు కాళ్ల రోబో ఇది. దీనిపేరు బిగ్‌డాగ్. మిలిటరీ వాళ్లకు సాయం చేసేందుకు ఈ తెలివైన రోబోటిక్ డాగ్‌ను తయారు చేశారు. సైనికశక్తికి కొత్త టెక్నాలజీని జోడించడం కోసం డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ ఈ కొత్త రోబోను తయారు చేసింది. బిగ్‌డాగ్ తన దృఢమైన కాళ్లతో యుద్ధవాహనాలకు కూడా కష్టతరమైన ఉపరితలంపై.. సైనికుల వెంట నడుస్తుంది. ఇది 340 పౌండ్లు (150 కిలోగ్రామ్స్) బరువుగల వస్తువును గంటకు 6.4 కిలోమీటర్ల వేగంతో విసురగలదు. అందుకే దృఢమైన రోబోట్స్‌లో స్థానం దక్కించుకున్నది.

నావ్ రోబో

స్వతంత్రంగా వ్యవహరించే రోబో ఇది. పారిస్‌లో ఉండే ఆల్డిబరన్ రోబోటిక్స్ అనే ఫ్రెంచ్ కంపెనీ రూపొందించిన ఈ యంత్రుడు.. స్వయంగా ప్రోగ్రామింగ్ చేసుకోగలడు. అంతేకాదు కట్టింగ్ ఎడ్జ్‌మోషన్, వ్యూ మరియు ఆడియో సామర్థ్యాలను కలిగి ఉన్నదీ రోబో. విభిన్నమైన ఉపరితలాలపైన నడువగలదు. వస్తువులను, మనుషుల ముఖాలను గుర్తించగలదు. ఎమోషన్స్‌ను వ్యక్తం చేయగలదు, అర్థం చేసుకోగలదు. స్పర్శ, వినికిడి కమాండ్స్‌కు స్పందిస్తుంది. ఇది చాలదనుకొంటే.. గగ్నమ్ ైస్టెల్ డ్యాన్స్‌తోనూ అలరించగలదు ఈ బలమైన రోబో.

584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles