2019లో ప్రప్రథమ ప్రాపర్టీ షో..


Sat,January 12, 2019 01:25 AM

-క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో
-ఫిబ్రవరి 15- 17 తేదీల్లో
-వేదిక: హైటెక్స్, మాదాపూర్

credai
ప్రాపర్టీ షోల నిర్వహణలో క్రెడాయ్ హైదరాబాద్ ముందునుంచీ విభిన్నంగా ఆలోచిస్తుంది. పీపుల్స్ ప్లాజా అయినా హైటెక్స్ అయినా.. కొనుగోలుదారులకు అవసరమయ్యే ప్రాజెక్టులను ప్రదర్శిస్తుంది. ఈసారి నిర్వహించే ప్రాపర్టీ షో కాస్త భిన్నమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తున్న ప్రప్రథమ ప్రాపర్టీ షో ఇది. ఫిబ్రవరి 15 నుంచి 17 మధ్యలో నిర్వహించే మూడు రోజుల ప్రదర్శనలో దాదాపు 120 సంస్థల దాకా పాల్గొంటాయని నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం రియల్టర్లు, డెవలపర్లే కాకుండా నిర్మాణ సామగ్రి సరఫరాదారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వంటివి పాల్గొంటాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎస్.రాంరెడ్డి తెలిపారు. ఈసారి కనీసం యాభై వేల మంది సందర్శకులు విచ్చేస్తారని క్రెడాయ్ హైదరాబాద్ అంచనా వేస్తున్నది. పాతవాటితో బాటు కొత్త అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హరిత భవనాలు, సమీకృత పట్టణాలతో బాటు వాణిజ్య సముదాయాల వివరాలు సందర్శకులు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles