పారిశ్రామిక పార్కుల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులు


Sat,January 12, 2019 01:24 AM

తెలంగాణలోని పారిశ్రామిక పార్కుల్లో వాక్ టు వర్క్ కాన్సెప్టుకు సరికొత్త ప్రోత్సాహం లభించనున్నది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. బడా పారిశ్రామిక పార్కుల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులను అనుమతిస్తామన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫెట్‌షియా) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ఆయా పార్కుల్లో పని చేసే వారికోసం గృహవసతిని కల్పిస్తామన్నారు. టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపూర్‌లో ఏర్పాటయ్యే ఎంస్‌ఎంఈ పార్కుకు స్థలం కేటాయిస్తామన్నారు. కేవలం పరిశ్రమల కోసం ప్రభుత్వం 20 నుంచి 30 శాతం స్థలాన్ని కేటాయిస్తుందన్నారు.

407
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles