మేఘాలతో సయ్యాట.. సాధ్యమే ఇక!


Sat,January 5, 2019 12:53 AM

- మైవాన్ పరిజ్ఞానంతో జోరుగా నిర్మాణ పనులు
- రికార్డు స్థాయిలో మై హోమ్ అవతార్ పూర్తి
- 31 అంతస్తుల ఆకాశహర్మ్యం.. 4 నెలల ముందే అప్పగింత

myhome-avataar
హైదరాబాద్‌లో అత్యుత్తమ ప్రాంతం..ఆకాశహర్మ్యాల్లోకెల్లా వినూత్న ఆవిష్కరణ..ఆధునిక నివాసంలో అన్నివేళలా ఆనందం..భార్యాభర్తలిద్దరికీ నచ్చేలా సరికొత్త ఆవాసం..అసాధారణ ప్రాజెక్టులో నివసిస్తున్న అనుభూతి.. 31 అంతస్తులో మేఘాలతో దోబూచులాడుకునేలా..అందంగా.. ఆకర్షణీయంగా.. అపూరమైన రీతిలో..
ముస్తాబైన ప్రాజెక్టే.. మై హోమ్ అవతార్!నిర్మిస్తోన్న సంస్థ.. మై హోమ్ గ్రూప్..


హైదరాబాద్‌లో కొనుగోలుదారులకు సకాలంలో ఫ్లాట్లను అందించే సత్తా ఉన్న నిర్మాణ సంస్థల్లో మై హోమ్ గ్రూప్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మాదాపూర్ హైటెక్ సిటీ పక్కనే.. మై హోమ్ నవద్వీప వంటి ఆధునిక నిర్మాణాన్ని ఆవిష్కరించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. అసలు హైదరాబాద్‌లో ఎవరూ ఊహించక ముందే.. అప్పట్లోనే అందరినీ అమితంగా ఆకర్షించిందీ బడా గేటెడ్ కమ్యూనిటీ. నగర నిర్మాణ రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించిన ప్రాజెక్టుగా మైహోమ్ నవద్వీప దశాబ్దంన్నర క్రితమే ఖ్యాతినార్జించింది. ఆతర్వాత, మై హోమ్ జ్యుయల్, మై హోమ్ అబ్రా వంటి బడా లగ్జరీ ప్రాజెక్టులను విజయవంతంగా కొనుగోలుదారులకు అప్పగించిందీ సంస్థ. నిర్మాణ రంగంలో తనదైన ప్రత్యేక ముద్ర వేసిన మై హోమ్ సంస్థ తాజాగా.. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరువలో మై హోమ్ అవతార్ అనే ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. సుమారు 22.57 ఎకరాల్లో.. 2,780 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఇందులో వచ్చే బ్లాకుల సంఖ్య.. దాదాపు పది. ప్రతి బ్లాకు మధ్య వంద ఫీట్ల దూరం ఉంటుంది. ఒక్కో బ్లాకు జి+30 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ప్రతి బ్లాకులో 278 ఫ్లాట్లు వచ్చేలా మై హోమ్ డిజైన్ చేసింది. మొదటి విడతలో అభివృద్ధి చేసిన బ్లాకులను ఈ ఫిబ్రవరి నుంచే కొనుగోలుదారులకు అందించడానికి సన్నాహాలు చేస్తున్నది. ఇక, రెండో ఫేజు ఫ్లాట్లను 2020 మార్చి నాటికి అప్పగించడానికి సంస్థ ప్రణాళికల్ని రచించింది.

My-Home-Avatar1

చివరి దశలో.. ఐదు టవర్లు

హైదరాబాద్‌లో ముప్పయ్ ఒక్క అంతస్తుల ఆకాశహర్మ్యాల్ని కట్టడమంటే మాటలు కాదు. నిజానికిది కత్తిమీద సాములాంటి పనే. అయినప్పటికీ, పది బ్లాకుల నిర్మాణ పనుల్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. వీటిలో ఐదు బ్లాకులు.. జి+ముప్పయ్ అంతస్తుల నిర్మాణం పూర్తయ్యి.. ప్రస్తుతం ప్లాస్టరింగ్ దశలో ఉన్నాయి. ఆరో బ్లాకు 30వ అంతస్తులో రూఫ్ శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. ఏడో బ్లాకు, పదో బ్లాకు 30వ అంతస్తు రూఫ్ శ్లాబు పూర్తి కాగా.. ఎనిమిదో బ్లాకు 19 అంతస్తుల్లో పని జరుగుతున్నది. తొమ్మిదో బ్లాకు 24వ అంతస్తులో పని యమజోరుగా జరుగుతున్నది. కొనుగోలుదారులకు చెప్పిన గడువు కంటే ముందే పూర్తి చేసేస్తోంది.


80:20 నిష్పత్తిలో నిర్మాణం..

మై హోమ్ అవతార్ ప్రత్యేకత ఏమిటంటే.. 80:20 సూత్రం ప్రాతిపదికన నిర్మాణం జరుపుకున్నది. అంటే, 83.5 శాతం ఖాళీగా, కేవలం రిక్రియేషన్ కోసం కేటాయించారు. మిగతా 16.5 శాతం స్థలంలో 10 బ్లాకుల్ని చేపట్టారు. మొత్తం 22.57 ఎకరాల్లో ఖాళీ స్థలం రావడం వల్ల.. ఇందులో నివసించేవారు ప్రతిక్షణాన్ని ఆస్వాదించడానికి వీలు కలుగుతుంది. టెన్నిస్ ఆడాలన్నా.. ప్రకృతిలో విహరించాలన్నా ఇట్టే సాధ్యమవుతుంది. అత్యుత్తమ ప్రాంతంలో ప్రాజెక్టును తీర్చిదిద్దడం వల్ల.. కొనుగోలుదారులు తమ ఆఫీసులకు రాకపోకలు సాగించడానికి సులువుగా మారుతుంది. ప్రపంచ స్థాయి సదుపాయాలు, తివాచీ పర్చిన పచ్చదనం వంటివి ప్రతిఒక్కరి జీవితాన్ని ఆనందమయం చేస్తుందని సంస్థ చెబుతోంది. పురుషులు, మహిళలకు విడిగా స్విమ్మింగ్ పూల్, ఔట్‌డోర్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్, టెన్నిస్ కోర్టులు.. యాంఫీ థియేటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రతి బ్లాకులో విడిగా విజిటర్ల లాబీ, ఇండోర్ గేమ్స్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు జాగింగ్ ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకసారి అవతార్ చుట్టూ తిరిగితే 1.20 కిలోమీటర్లు అవుతుంది. ఆఫీసులకు మై హోమ్ అవతార్ చేరువగా ఉండటం వల్ల.. భార్యభర్తలిద్దరూ తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్‌జామ్లలో కాకుండా.. తమ పిల్లలతో గడిపే వీలు కలుగుతుంది. హైదరాబాద్ ఆధునిక జీవనానికే సరికొత్త బ్రాండ్‌గా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని సంస్థ చెబుతున్నది.


నాలుగు నెలల ముందే బయ్యర్లకు..

మై హోమ్ అవతార్‌ను 2019 జూన్ నాటికి బయ్యర్లకు అందించాలని తొలుత ప్రణాళికల్ని రచించాం. కాకపోతే, అంతకంటే ముందే, వచ్చే నెల నుంచే కొనుగోలుదారులకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ మొత్తం నిర్మాణాన్ని మైవాన్ పరిజ్ఞానం సాయంతో చేపట్టాం. ఇందులో నివసించేవారు చక్కటి అనుభూతిని పొందేలా ప్రాజెక్టును సకల హంగులతో తీర్చిదిద్దుతున్నాం. ఆధునిక జంటలకు అవసరమయ్యే అన్నిరకాల సదుపాయాల్ని అవతార్‌లో పొందుపరుస్తున్నాం.
- శ్రీనివాస్‌రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, మైహోమ్ గ్రూప్


- కింగ్ జాన్సన్ కొయ్యడ

181
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles