తెరపైకి అద్దె గృహాలు..


Sat,January 5, 2019 12:46 AM

rental
భారతదేశంలోని నగరాలు, పట్టణాల్లో అతికీలకమైన అద్దె గృహాల విధానం మళ్లీ తెరపైకి వచ్చేసింది. ఈ విధానాన్ని ఆరంభించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రధానంగా అంతర్గతంగా కొందరు మంత్రులతో చర్చించాక.. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నదని తెలిసింది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం వెంటనే తీసుకునే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో ఇంటి యజమాని, అద్దెదారుడి మధ్య సత్సంబంధాలు ఉండటం అరుదు. పైగా, ఇదెంతో సంక్లిష్టమైన వ్యవహారం. అందుకే, 2014లో ఈ పాలసీకి సంబంధించి డ్రాఫ్ట్‌ను రూపొందించినా, ఇంతవరకూ పట్టాలపైకెక్కలేదు. పన్నెండో పంచవర్ష ప్రణాళిక ప్రకారం.. దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఇండ్ల కొరత దాదాపు 1.87 కోట్ల దాకా ఉన్నది. కిరాయిదారులను పరిరక్షిస్తూ కొన్ని స్థానిక చట్టాలుండటం.. వాణిజ్య సముదాయాల్లో యజమానులు, కిరాయిదారుల మధ్య కోర్టు కేసులుండటం వంటి అంశాల వల్ల రెంటల్ హౌసింగ్ పాలసీని కేంద్రం ప్రవేశపెట్టలేదు. కాకపోతే, నగరాల్లో పెరుగుతున్న ఇండ్ల కొరతను అధిగమించాలంటే.. దీనిపై అతిత్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

378
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles