ఇండ్ల ధరల్లో 9.5% పెరుగుదల


Sat,January 5, 2019 12:45 AM

house
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వెల్లడి
హైదరాబాద్‌లో ఇండ్ల ధరలు 9.5 శాతం పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) తాజాగా వెల్లడించింది. సవరించిన డేటా ప్రకారం, తాజా వివరాల్ని ఎన్‌హెచ్‌బీ తెలియజేసింది. మన తర్వాతి స్థానాల్లో పుణె, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలు నిలిచాయి. చన్నైలో రేట్లు పెద్దగా మారలేదు. ఢిల్లీలో మాత్రం -4.8 శాతానికి పడిపోయాయి. ఇక, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల విషయానికొస్తే.. దేశవ్యాప్తంగా 39 నగరాల్లో ధరలు పెరిగాయి. ఎనిమిది నగరాల్లో ఎనిమిది శాతం మేరకు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఇండ్ల ధరలను మూడునెలలకోసారి తెలుసుకునేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎన్‌హెచ్‌బీ రెసిడెక్స్‌కు శ్రీకారం చుట్టింది. భారత్‌లోని మొత్తం 21 నగరాల్లో ఈ బ్యాంకు ఎప్పటికప్పుడు ధరల హెచ్చుతగ్గుల్ని నమోదు చేస్తుంది. అయితే, ఈ ఏడాది హైదరాబాద్ రియల్ రంగం 6.3 శాతం అభివృద్ధి చెందే అవకాశముందని తెలియజేసింది. మనతర్వాతి స్థానాల్లో ముంబై (4.1 శాతం), ఢిల్లీ (4.1 శాతం), చన్నై (3.1 శాతం), పుణె, అహ్మదాబాద్ (2 శాతం), బెంగళూరు (1 శాతం) వంటివి నిలుస్తాయని ఎన్‌హెచ్‌బీ వెల్లడించింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. పశ్చిమ హైదరాబాద్‌లో పలు నిర్మాణ సంస్థలు ఫ్లాట్ల ధరలను గత కొంతకాలం నుంచి పెంచాయి. మార్కెట్ నుంచి మంచి గిరాకీ ఉండటమే కారణమని అంటున్నాయి.

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles