ఐకియా మనకేం తెచ్చింది?


Sat,July 7, 2018 12:20 AM

దేశంలోనే కొత్త రాష్ట్రం మనది. అయినప్పటికీ, ప్రపంచంలోనే ఫర్నీచర్ దిగ్గజం అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక సంస్కరణల పుణ్యమా అంటూ.. స్వీడన్ సంస్థ ఐకియా హమారా షహర్‌లోకి ప్రవేశించింది. నగరంలోని ఆధునిక గృహయజమానుల అభిరుచులకు అద్దం పట్టేందుకు.. ఐకియాకు చెందిన నిపుణులు దాదాపు వెయ్యి గృహాలను సందర్శించారు. ఇక్కడి పోకడల్ని గమనించి.. మాదాపూర్‌లోని ఐకియా స్టోర్‌ను తీర్చిదిద్దారు. కుటుంబ సభ్యుల మధ్య గల బంధాల్ని బలోపేతం చేసే గృహాలంకరణ వస్తువుల్ని మన ముంగిట్లోకి తెచ్చారు. ఈ నెల 19న అట్టహాసంగా ఆరంభం కానున్న ఐకియా స్టోర్‌ని నమస్తే సంపద ఇటీవల సందర్శించింది. ఈ సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం.
get-inspired-banner
ఇల్లంటే కేవలం ఫర్నీచరే కాదు.. మన జీవితంలోని ప్రతిరోజు ప్రారంభమై.. ముగిసేంత వరకూ బోలెడన్నీ కబుర్లకు ముచ్చటైన వేదిక. ఆనంద క్షణాల్ని అతిమధుర జ్ఞాపకాలుగా మల్చుకునే స్థలం. మన కలల్ని వాస్తవికం చేసుకునే ప్రాంతం. మరి, జీవితాన్ని సాఫీగా, సంతోషంగా మార్చివేసే మహత్తరమైన గృహాన్ని అతిసుందరంగా ముస్తాబు చేసుకునే మహత్తర అవకాశం మన ముంగిట్లోకి వచ్చేసింది. ఇదేదో కేవలం సంపన్నులకు పనికొచ్చే ఫర్నీచర్ షోరూము అని భావించొద్దు. సామాన్యులు సైతం కొనుక్కునే అనేక ఫర్నీచర్ ఉత్పత్తులు లభిస్తాయిక్కడ. ఇంటిల్లిపాదికీ అవసరమయ్యే సమస్త ఫర్నీచర్ దొరుకుతుందిక్కడ. కొన్ని వస్తువులైతే కేవలం రూ.20కే ఇందులో దొరుకుతాయి. ఈ షోరూము మొత్తం ఒక్కసారి తిరిగితే.. దాదాపు ఏడు కిలోమీటర్లు అవుతుంది. అంతంత దూరం నడిచే ఓపిక లేనివారికి బ్యాటరీ వాహనాల్ని ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. దాదాపు వెయ్యి సీట్ల సామర్థ్య గల హోటల్‌ను ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇందులో అల్పాహారం అతి తక్కువ ధరకే దొరుకుతుందని సంస్థ ప్రతినిధులు అన్నారు.
EKTORP

క్లిప్పన్ సోఫా

స్వీడన్‌లో క్లిప్పన్ అనేదో ప్రాంతం. ఈ సోఫాను శుభ్రం చేయడమెంతో తేలిక. బయటికి తీసి శుభ్రపర్చి మళ్లీ అమర్చుకోవచ్చు. ఈ రకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇందులో కుక్కల కోసమూ ప్రత్యేక సోఫాలు లభిస్తాయి.

ఫార్‌గ్రిక్ మగ్

మీ ఇంట్లోని టేబుల్ మీద అందమైన అలంకరణ వస్తువుగా ఉంటుందీ ఫార్‌గ్రిక్ మగ్. ఇందులో మనకు నచ్చిన రంగులు, ఆకారాలు లభిస్తాయి. డైనింగ్ టేబుల్ మీద అల్పాహారం తినేటప్పుడైనా, భోజనం చేసేటప్పుడైనా ఉపయోగపడే వస్తువు ఇది.

ల్యాక్ టేబుల్

ఇదో కొత్తరకమైన టేబుల్. సులువుగా అమర్చుకోవచ్చు. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. నచ్చిన ఆకారాల్లో ఈ టేబుళ్లు లభిస్తాయి. కుర్చీల్లోకెల్లా భిన్నమైనది.. పోఆంగ్ ఆర్మ్ చెయిర్. కాటన్, లెనిన్ బట్టలతో అది మృదువుగా తీర్చిదిద్దిన కుర్చీ ఇది. వీటిలో చిన్నారులకు అవసరమయ్యే రకాలూ దొరుకుతాయి.

మాల్మ్ బెడ్

పడక మంచం అంటే కేవలం పడుకోవడానికే అని చాలామంది అనుకుంటారు. అయితే, ఈ మంచంలోనూ అనేక వస్తువులను భద్రపర్చుకునే వీలుంటుంది. గది సైజుకు తగ్గట్టు ఈ మంచాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పైగా, ఇది డ్రాలు, బెడ్‌సైడ్ టేబుళ్లతో వస్తుంది. అవసరమనుకుంటే, వినీర్ ఫినిషింగ్‌తో ఉన్న రకాలూ ఇందులో లభిస్తాయి. ఈ మంచాలను సర్దుబాటు చేసుకునే సౌలభ్యముంది. ఫలితంగా, ఎంత మందం గల పరుపులైనా ఈ మంచం మీద వేసుకోవచ్చు.
MBOY

స్టాక్‌హోమ్ రగ్

సుశిక్షితులైన చేతి పనివాళ్లు తయారు చేసిన రగ్గులు ఇవి. ఒక్కో రకం ఎంతో భిన్నంగా ఉంటుంది. రెండువైపులా ఒకే ఆకారం ఉంటుంది. ప్రపంచంలోనే పేరెన్నిక గల ఎక్‌టార్ప్ సోఫా హైదరాబాద్ వాసులకు ఐకియా పరిచయం చేస్తుంది. రాస్‌కాగ్ ట్రాలీ అనేది ప్రతిఒక్కరికీ ఇట్టే నచ్చుతుంది. కిచెన్, హాల్, బెడ్‌రూం, హోమ్ ఆఫీస్.. ఇలా ప్రతిచోట ఈ ట్రాలీని వినియోగించుకోవచ్చు. యాంటిలాప్ హై చెయిర్.. చిన్నారులతో పాటు పెద్దలకు ఉపయోగపడుతుంది. ఈ కుర్చీ వల్ల చిన్నారులకు ఆహారం భుజించే అలవాటును సులువుగా నేర్చుకుంటారని సంస్థ చెబుతోంది. పైగా, చిన్నారులను ఎక్కడికైనా ఇట్టే తీసుకెళ్లవచ్చని అంటోంది.
Jon

బిల్లీ బుక్ కేస్

హైదరాబాద్‌లో ఈ నెల 19న ప్రారంభమయ్యే ఐకియా స్టోర్‌లో కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని పరిచయం చేసింది. ఇంట్లోని పుస్తకాలను అందంగా అమర్చడానికి బిల్లీ బుక్ కేస్‌ను ఆవిష్కరించింది. మన గది వైశాల్యం

7,500 రకాల వస్తువులు

హైదరాబాద్‌లోని మా ఐకియా స్టోర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇరవై శాతం వస్తువుల్ని స్థానిక ఉత్పత్తిదారుల నుంచి సేకరిస్తున్నాం. సుమారు 7,500 రకాల వస్తువుల్ని ఇందులో విక్రయిస్తున్నాం. వచ్చే ఏడాది ఆరంభంలో ముంబైలో మరో ఐకియా స్టోర్‌ను ప్రారంభిస్తాం. మేం విక్రయించే వస్తువుల్ని హోమ్ డెలివరీ చేస్తాం. ఇందుకోసం గతి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం.
- జాన్ అకిలియా ఎండీ, ఐకియా

కింగ్ జాన్సన్ కొయ్యడ

పెట్టుబడి:1000కోట్లు
-ప్రత్యక్ష ఉద్యోగులు: 1,000 మంది, పరోక్షం: 1,500 మహిళలే 50%
-మొత్తం విస్తీర్ణం: 13 ఎకరాలు
-నిర్మాణ స్థలం: 4,00,000 చదరపు అడుగులు
-ఏటా కనీసం 30-60 లక్షల మంది, వారాంతాల్లో 50 వేల మంది సందర్శకులు విచ్చేస్తారని అంచనా
-ఐకియాలో మొత్తం 7,500 వస్తువులు లభిస్తాయి.
-పార్కింగ్ స్థలం: 1200 యూనిట్లు పెట్టుకోవచ్చు
-800 రకాల వస్తువుల రేటు: కేవలం రూ.200 లోపే
-10-20 రూపాయలకు దొరికే వస్తువూలూ ఉన్నాయంటే నమ్మండి
-వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసుకునే హోటల్ ఏర్పాటు
-చికెన్ బిర్యానీ.. రూ.99 నుంచి ఆరంభం

1724
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles