పకృతిని వీక్షిసూ..అనుభూతిని ఆస్వాదిస్తూ


Fri,January 18, 2019 01:11 AM

రైలు ప్రయాణమంటే తొందరగా, సురక్షితంగా గమ్యానికి చేర్చే మార్గం ఒక్కటే కాదు. దూర ప్రయాణాలను దగ్గరే చేసే మార్గం అంతకన్నా కాదు. ప్రయాణం చేస్తూ ప్రకృతిని వీక్షిస్తూ అనుభూతిని ఆస్వాదిస్తూ ఈ రైలు మార్గాల గురించి చదివేయండి. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా, గంటలు రోజులుగా, రోజులు నెలలుగా క్యాలెండర్లు మారుతున్నాయి. కన్నుమూసి తెరిచేలోపు గడిచిపోవాల్సినవి గడిచిపోయి జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. మనం గడిపిన క్షణాలు గొప్పగా ఉండాలంటే ప్రయాణాలు చేయాలి. గొప్ప ప్రయాణాలు గొప్ప జ్ఞాపకాలను ఇస్తాయి. ప్రయాణాలను, ప్రకృతిని ఇష్టపడే వాళ్లు జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి రైలు ప్రయాణం చేయాలి. ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన రైలు ప్రయాణాలివి..


గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్

Train
జెర్మాట్, సెయింట్ మోరిట్జ్ ప్రాంతాలను కలుపుతూ స్విట్జర్లాండ్‌లో నిర్మించిన అత్యంత అందమైన రైలు వంతెన మార్గమిది. దీనికి గ్లేసియర్ ఎక్సెప్రెస్ వే అని పేరు పెట్టారు. ఈ దృశ్యాన్ని చూడడం కంటే వెళ్లి అక్కడ ప్రయాణిస్తే బాగుంటుంది. ఈ దారి గుండా ప్రయాణిస్తే 91 సొరంగాలుంటాయి. 291 వంతెనలుంటాయి. గ్లేసియర్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఈ వంతెన సముద్ర మట్టానికి 6706 ఫీట్ల ఎత్తు ఉంటుంది. ఆరు పిల్లర్లు కలిగిన ఈ వంతెన చూడగానే ఆకర్షిస్తుంది.

ది హాన్

the-ghan
ప్రపంచంలో ఎక్కడా చూడని ప్రకృతి అందాలు ఈ ప్రయాణంలో చూడొచ్చు. ఆస్ట్రేలియాలోని ది హాన్ ట్రావెల్స్ నుంచి డార్విన్, ఆడిలైడ్ వరకు ప్రయాణించవచ్చు. ఇది సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సారవంతమైన ఎర్రనేలల మీద కనుచూపు మేర ఉండే మైదానాలలో నుంచి ఈ ప్రయాణం సాగుతుంది.

ఫస్ట్ ప్యాసేజ్

First-Passage
పర్వాతారోహకులు ఎక్కువగా వెళ్లే మార్గమిది. ఫస్ట్ ప్యాసేజ్ ఆఫ్ వెస్ట్ అని ఈ మార్గాన్ని పిలుస్తారు. ఎత్తైన పర్వతాలు, చుట్టూ పొగమంచు, కనుచూపు మేర కనిపించే అందమైన ప్రకృతి అందాల నెలవిది. సౌత్ బ్రిటిష్ కొలంబియా వాంకోవర్ మధ్య ఉన్న ఈ రైలు మార్గం అత్యంత సుందరమైన రైలు మార్గాలలో ఒకటి. నగరాలు, గ్రామాలతో సంబంధం లేకుండా దట్టమైన అడవుల మధ్య నుంచి రైలు వెళ్తుంది. మధ్యలో కనిపించే సరస్సులు, చీకట్లో తారసపడే నగరాలు ఊహకు అందని అనుభవాన్నిస్తాయి.

ట్రాన్స్- సైబీరియన్

trance-cyberian
ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గాల్లో ఇది ఒకటి. రష్యా రాజధాని మాస్కో పశ్చిమాన ఉనన టెర్మినస్ వద్ద ప్రారంభమై, ట్రాన్స్ - సైబీరియరన్ ఉరల్ పర్వతాలపై నుంచి సైబీరియన్ అడవులను దాటుతూ వెళ్లాల్సి ప్రయాణమిది. ఇది రష్యా మొత్తం విస్తరించి ఉంటుంది. ప్రారంభమైన చోటు నుంచి గమ్యానికి చేరడానికి ఎనిమిది రోజులు పడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద మంచి నీటి సరస్సు అయిన బైకాల్ మీది నుంచి ఈ కూడా ప్రయాణం సాగుతుంది.

ట్రాన్స్ ఆల్పైన్

TRainss
న్యూజీలాండ్‌లని సౌత్ ఐలాండ్స్, క్రైస్టర్చ్ నుంచి ట్రాన్స్ ఆల్పైన్‌ల వరకు వెళ్లే రైలు ప్రయాణం అరణ్యాల మీదుగా వెళ్తుంది. ఉష్ణమండలాలు, వర్షారణ్యాలనుకూడా చూడొచ్చు. స్కాట్లాండ్‌లోని అతిపెద్ద నగరమైన గ్లాస్గో పట్టణంలో ఉన్న రైలు మార్గం ప్రయాణీకులను ఆకట్టుకుంటుంది. మరిచిపోలేని మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. హ్యారీపోర్టర్, పలు వెబ్‌సిరీస్‌లలో ఈ లొకేషన్లను ఎక్కువ చూపించారు. ఇక సౌతాఫ్రికాలోని నమీబియా సఫారీ రైలు ప్రయాణం గురించి వర్ణించలేము. రెండు వేల కిలోమీటర్లు దట్టమైన అడవుల్లో , చుట్టుపక్కల జట్టువులు, నీటి కొలనులతో దర్శనమిస్తుంది. నదులు, జలపాతాలను దాటుకుంటూ వెళ్లే ఈ ప్రయాణం బాగుంటుంది. ఇలాంటివి మొత్తం ప్రపంచవ్యాప్తంగా పదకొండు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రయాణాలు చేసి ఆ అనుభూతిని పొందాలి.

895
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles