అత్యంత కాలుష్య దేశమేదంటే..?


Fri,January 18, 2019 01:02 AM

ప్రపంచవ్యాప్తంగా సంభంవించే మరణాల్లో ఐదుశాతం వాయు కాలుష్యం వల్లేనని, మంచి ఆహారం, జీవనశైలి ఉన్నా పీల్చే గాలిలో ఉన్న కార్బన్‌మోనాక్సైడ్ వల్ల అనారోగ్యం పాలవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. వరల్డ్ హెల్త్
air-pollution
ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) 92 దేశాల్లోని 1622 పట్టణాల్లో గాలి నాణ్యతను పరీక్షించింది. ముఖ్యంగా గాలిలోని కణాలు, పొగ, మసి వంటివి పీల్చుకోవడం వల్లే ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. పాకిస్థాన్‌లో నలుసు పదార్థాల సాంద్రత అతి ఎక్కువ ఉన్నది. ఆ తర్వాత ఖతర్, అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, దుబాయి, మంగోలియా, ఇండియా, బెహరెన్, నేపాల్ ఇలా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇండియా ఇందులో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత విషయంలో చైనా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే టాప్ పది దేశాల్లో కూడా దాని పేరులేదు. ఇదిలా ఉంటే.. మంచి నాణ్యతగల గాలి ఉన్న దేశాలుగా ఆస్ట్రేలియా, బ్రునై, న్యూజీలాండ్, ఇస్టోనియా, ఫిన్‌లాండ్‌లు నిలిచాయి. ఈ దేశాలకు వెళ్లాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

645
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles