చీకటి ఉంటే గానీ తెలియదు పగలు విలువ. మరి ఎప్పటికీ పగలే ఉంటే ఎలా ఉంటుంది? సూర్యుడు మొదట ఉదయించే దేశాల గురించి మీరు చదివే ఉంటారు. మరి సూర్యుడు అస్తమించని దేశాల గురించి విన్నారా? అలాంటి ప్రదేశాలున్నాయని మీకు తెలుసా?

ఇరవై నాలుగు గంటలు సూర్యుడు ఉదయించి ఉంటే అత్యద్భుతమే అవుతుంది కదా! ఇక్కడ సూర్యాస్తమయం అనే ముచ్చట అసలు ఉండదు. ఎప్పుడూ పగలు మాత్రమే ఉండే ఆ ప్రదేశాలను ల్యాండ్స్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అంటారు. ముఖ్యంగా జపాన్‌లో ఏప్రిల్ ఆఖరివారం నుంచి ఆగస్టు వరకు సూర్యుడు రాత్రి, పగలు అన్న బేధం లేకుండా అన్ని వేళలా దర్శనమిస్తాడు. అందుకే అక్కడి ప్రజలు ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. యూరోపియన్ ఖండంలోని ఒక దేశమైన నార్వేలో సుమారు 76 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన కెనడాలో నార్త్ వెస్ట్ ప్రదేశంలో 56రోజులు సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఐస్‌ల్యాండ్, స్వీడన్ వంటి దేశాల్లో కూడా చీకటి అనేది ఉండదు. ఆ సమయంలో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఆ అరవై రోజులూ ఆయా దేశాల్లో ఉత్సవాలు ఘనంగా జరుపుతారు.