
విహార యాత్రలకు వెళ్లాలనుందా? ఏ చోటకు వెళ్లాలి? ఎలాంటి ప్రదేశాలు చూడాలి? అన్న సందేహంలో ఉన్నారా? అయితే మీలాంటి వాళ్ల కోసమే ఈ యాప్. మీకు నచ్చిన ప్రదేశాలు అక్కడ అందుబాటులో ఉండే వసతుల గురించి ఈ యాప్లో ఉంటాయి. ఎక్కడికో వెళ్లి వెతకాల్సిన అవసరం ఉండదు. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మరింత ఈజీ అవుతుంది. ఇందులో మీరున్న చోటు నుంచి మీరు వెళ్లాల్సిన ప్రదేశాలు ఎంతదూరం ఉన్నాయి? మీరు వెళ్తున్న ప్రదేశం చుట్టుపక్కన చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. యాత్రా ప్రదేశాలలో దొరికే ఆహారం, అందుబాటులో ఉండే హోటళ్లు అవి అందించే సర్వీస్లు వంటి విశేషాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.