వెల్లాయని సరస్సు


Fri,January 4, 2019 12:28 AM

వెల్లాయని సరస్సు తిరువనంతపురం జిల్లా గుండా ప్రవహించే అతి పెద్ద మంచి నీటి సరస్సు. స్థానికులు దీన్ని వెల్లాయని కాయల్ అని పిలుస్తారు.తిరువనం తపురం ప్రధాన బస్సు కూడలి నుంచి కేవలం 9 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.
Harverting
స్థానికులు, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే విహార కేంద్రాల్లో వెల్లాయని సరస్సు ఒకటి. కోవళం వెళ్తే ఒక్కసారైనా ఈ సరస్సును చూడాల్సిందే. తాజాగా ఉండే స్వచ్చమైన నీలిరంగు నీళ్ళతో ఈ సరస్సు చాలా అందంగా కనపడుతుంది. ఈ సరస్సు మీద వెన్నెల పడగానే ఈ ప్రాంతం అంతా మనోహరంగా మారిపోతుంది. ఈ దృశ్యాన్ని చూడడానికి పర్యాటకులు రాత్రిదాకా వేచి ఉంటారు. ఈ సరస్సులో ప్రతి ఏటా ఓనం పండుగ సందర్భంగా పడవ పందాలు జరుగుతాయి. వీటిని చూడడానికి చాలామంది వస్తారు. ఓనం పండుగ రోజులలో కోవళంలో గానీ చుట్టుపక్కల గానీ జరిగే పడవ పందాలను తప్పకుండా చూడ వలసిందే.

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles