అభ్రాతృ ఘ్నీం వరుణాపతి ఘ్నీం బృహస్పతే
ఇంద్రాపుత్ర ఘ్నీం లక్ష్మింతామస్మై సవితు స్సువ:

వధూవరులిద్దరికీ జీలకర్ర, బెల్లాన్ని ధరింపజేసిన తర్వాత ఆ ఇద్దరి నడుమ ఉన్న తెరను తొలగిస్తారు. అప్పుడది ఒకరి నొకరు చూసుకునే సమయం. ఈ సందర్భంగా పై మంత్రాన్ని పురోహితుడు పఠిస్తాడు. వరుణదేవుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు ఈ నూతన దంపతులను సత్సంతానవంతులుగా దీవింతురుగాక. వధువును ఆరోగ్యవంతురాలిగా చూడవలసింది అని వారికి ఆశీస్సులు అందించడమే ఇందులోని పరమార్థం.