ఎందుకంటే?


Thu,January 17, 2019 11:25 PM

Endukante
మనుషులు ధర్మబద్ధంగా ఎందుకు జీవించాలి? అలా చేస్తే ఏమొస్తుంది? అనే సామాన్యుల ప్రశ్నలకు హైందవ పండితులు ఇచ్చే సమాధానం మోక్షప్రాప్తి. ధర్మమార్గంలో నడిస్తే తత్వజ్ఞానం లభిస్తుందంటారు. ఇది మనల్ని ముక్తి వైపు నడిపిస్తుంది. అందరికీ వర్తించే ధర్మాలు ఏవంటే ప్రకృతిపట్ల శ్రద్ధ, జీవులపట్ల అహింస, వ్యక్తిగతంగా అరిషడ్వర్గాలను జయించడం, దైవభక్తిని కలిగి ఉండడం వంటివి. మానవులు తాము చేసే కర్మలలో అప్రయత్నంగా జరిగేవి కొన్ని అయితే, బుద్ధిపూర్వకంగా చేసేవి మరి కొన్ని. ధర్మాధర్మాలు ఏవైనా బుద్ధిపూర్వక కర్మలకే వర్తిస్తాయని వారు అంటున్నారు. కాబట్టి, ఎవరైనా తెలిసి, ఇష్టపూర్వకంగా అధర్మమార్గంలో ప్రయాణించకూడదన్నది పెద్దల మాట.

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles