దేవాపితృ కార్యాభ్యాం
న ప్రమదితవ్యమ్
మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ॥
- తైత్తిరియోపనిషత్ (1.11.2)

దేవతల పట్ల, పితృదేవతల
(పూర్వీకులు) పట్ల మన ఆరాధనా భావాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ముందు తల్లిని దేవతగా కొలవాలి. తర్వాత వరుసగా తండ్రిని, గురువును, అతిథిని దైవాలుగా చూడాలని ఉద్భోదించే శ్లోకమిది.