ఇలా చేద్దాం


Thu,January 3, 2019 10:40 PM

Ila-cheddam
రేపటి అమావాస్యతో మార్గశిర మాసం ముగిసి, మర్నాటి నుంచీ పుష్యమాసం మొదలవుతుంది. పుష్యమీ నక్షత్రంలో సూర్యచంద్రులు ఉండే కాలం కనుక దీనికి ఈ పేరు వచ్చింది. ఈ మాసమంతా శూన్యమాసం. ఏ విధమైన శుభకార్యాలు (పెండ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి) చేయరాదని శాస్ర్తాలు చెబుతున్నాయి. అలాగని, ఈ నెలంతా అశుభమూ కాదు. ఈ సమయంలోనూ చేయవలసిన పూజాదికాలు, ఆరాధనలు ఉంటాయి. ఈ నక్షత్రాధిపతి శని. కనుక, శని గ్రహారాధన ఉత్తమం. పుష్యపౌర్ణమినాడు నదీస్నానం మరింత పుణ్యప్రదమనీ అంటారు. ఈ నెల పొడుగునా ఆధ్యాత్మిక సాధకులకు ఎంతో మంచిది. జపతపాదులు, ధ్యానపారాయణాలకు శ్రేష్ఠమని వేదపండితులు చెప్తారు. ముఖ్యంగా వేదాధ్యయనానికైతే విశిష్ఠమనీ, ఇంకా పితృదేవతల ఆరాధన కూడా ఈ కాలంలో పుణ్యప్రదమని వారు సూచిస్తున్నారు.

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles