పద్యనీతి


Thu,January 3, 2019 10:39 PM

అల్పబుద్ధి వాని కధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పు తినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినురవేమ ॥
- యోగి వేమన

Padyaneeti
బుద్ధిలేని వాడు అధికారంలోకి రావడం వల్ల కలిగే నష్టాన్ని వెల్లడించిన వేమన పద్యమిది. అలాంటి అల్పునికి రాజ్యాధికారం సిద్ధిస్తే అతను అహంకారంతో ఉత్తములైన వారినందరినీ దూరం పెడతాడు. ఎందుకంటే, అల్పుల స్వభావమే అంత కనుక. ఎలాగైతే, కుక్కకు చెప్పు రుచిస్తుంది కానీ, చెరకు తీపి రుచించదు కదా.

878
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles