అర్థం- పరమార్థం


Thu,August 9, 2018 11:08 PM

మాంగల్యం తంతునానేన
మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే
త్వం జీవ శరదశ్శతం.

Artham-Paramartham
హైందవ వివాహక్రతువులో మాంగల్యధారణ అత్యంత ప్రధానం. కానీ, చాలా చిత్రంగా దీనిని గురించి వేదాలలోగాని, గృహస్సూత్రాలలో కానీ చెప్పబడలేదని పండితులు అంటారు. అయినా, ఇదొక సదాచారంగా వస్తున్నది. నాతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఓ సౌభాగ్యవతీ! నా యావత్ జీవనానికి మూలాధారమైన ఈ పవిత్ర సూత్రాన్ని నీ కంఠానికి ఆభరణంగా అలంకరిస్తున్నాను. నువ్వు నిండు ఆయుష్షుతో నూరేళ్లు జీవించుమా! అన్న ఈ శుభాశీస్సును వరునితో పురోహితుడు ప్రత్యక్షంగా చెప్పిస్తాడు. అందరం దీని పరమార్థాన్ని అర్థం చేసుకోవలసి ఉంది.

523
Tags

More News

VIRAL NEWS