పొగడ్తలూ ప్రమాదమే..


Tue,January 8, 2019 11:02 PM

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో రోజూ పోస్టులు పెడుతుంటాం. కొందరు అదే పనిగా పోస్టులు పెట్టి కామెంట్లు, లైకుల కోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ల ఫొటో పోస్ట్ చేసి లైకులు, కామెంట్ల టార్గెట్ పెట్టుకుంటారు. వాటికి వచ్చే స్పందనను బట్టి మురిసి పోతుంటారు. అయితే రోజూ చేసే పోస్టుల్లో వచ్చే కామెంట్లు ముఖ్యంగా పొగడ్తలు యూత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా?
social--media
సోషల్ మీడియాలో పోస్టు చేసిన వాళ్ల ఫొటోకి వెటకారంగా స్పందిస్తే బాధపడుతారని పొగడటం చాలా మందికి అలవాటై ఉంటుంది. దగ్గరి ఫ్రెండో, బంధువో, ఆత్మీయుడో ఎవరి పోస్టుల్లో అయినా పొగడ్తలు సాధారణం. అమ్మాయిల పోస్టుల్లో అయితే అబ్బాయిల పొగడ్తల పర్వం చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పొగడ్తలు మానసికంగా ప్రమాదం కల్గిస్తాయని స్కూల్ ఆఫ్ సైకాలజీ సైన్స్ ఆఫ్ ఆస్ట్రేలియా యూనివర్శిటీ సర్వేలో తేలిందట. ఆ యూనివర్శిటీ ప్రొఫెసర్ నిక్ హస్లాం చెప్పిందేంటంటే.. సాధారణంగా పొగడ్తలు మనిషి మానిసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. చేస్తున్న పని మీద ఆసక్తిని, పట్టుదలను పెంచుతాయి.


అయితే సోషల్ మీడియాలో పొగడ్తల గురించి ఆ యూనివర్శిటీ చేసిన సర్వే ప్రకారం.. అతి పొగడ్తల వల్ల తెలియకుండా అవతలి వ్యక్తి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందట. ఒకరు ఫొటో పోస్టు చేస్తే అది ఎలా ఉన్నా మీరు అందంగా ఉన్నారు అని పొగిడితే అది మానసికంగా ప్రభావం చూపుతుందట. మీ పొగడ్తను గుర్తు చేసుకొని మరింత అందంగా తయారవడానికి అవతలి వ్యక్తి మెళికలు తిరుగుతారంట. తర్వాత పోస్ట్ చేసే ఫొటో మరింత అందంగా వచ్చి, ఇంకా పొగడ్తలను ఆశిస్తారట. ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వారు మానసిక ప్రశాంతతకు దూరమయ్యే ప్రమాదం ఉందని హస్లాం తన సర్వే ద్వారా తెలిపాడు. కాబట్టి ఇకపై సోషల్ మీడియాలో పొగడాలంటే కాస్త ఆలోచించి పొగడండి.

385
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles