మొదటిసారి ఓ యువతి..


Tue,January 8, 2019 10:58 PM

దేశ చరిత్రలో మొదటిసారి అమ్మాయి పరేడ్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు పోషించనున్నది. 71 ఆర్మీ పరేడ్‌లో ఆ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఇది దేశ ప్రగతికి చిహ్నం. రేపటి తరానికి ఆదర్శం.
army-pared
యువతులు ఏం చేస్తారు? అన్న మాట నుంచి.. యువతులు ఏమైనా చేస్తారు. ఏదైనా సాధిస్తారు అన్న స్థాయికి ఎదిగింది నేటితరం. ఇది చాలదా దేశ ప్రగతికి. ఆటో నడపడం మొదలు అంతరిక్షానికి వెళ్లేవరకు అన్నిరంగాల్లో వారుంటున్నారు. అన్నింట్లో అడుగుపెట్టి విజయం సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పుడు మరో అరుదైన ఘట్టానికి తెర తీయనున్నారు. దేశ చరిత్రలో ఇదొక మార్పుగా భావించవచ్చు. భారతీయ సాయుధ దళాల్లో మార్పు మొదలయింది. గతంలో మహిళల మీద చూపిన చిన్నచూపు ఇప్పుడు తగ్గింది. జనవరి 15న జరుగనున్న 71వ ఆర్మీ పరేడ్‌లో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనున్నది. లెఫ్టినెంట్ భావన కస్తూరి ఈ రికార్డును బద్దలు కొట్టబోతున్నది. 144మంది పాల్గొనబోతున్న ఈ పరేడ్‌లో 33 మంది పురుషులు వాహనాలతో సాహసాలు చేయనున్నారు. ఈ సాహస బృందం జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పరేడ్ చేయనున్నది.
narishaktithemeofrepublicda

639
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles