అనుష్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనట!


Tue,May 15, 2018 11:34 PM

బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ సామాజిక కార్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. సమయం దొరికినప్పుడల్లా జంతువులపై ఉన్న తన ప్రేమను చాటుకుంటూ ఉంటుంది. ఈ మధ్యనే తన పుట్టినరోజు సందర్భంగా జంతువుల సంరక్షణకు తాను చేపట్టనున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమిటో చెప్పేసింది.
Anushka-Sharma
అనుష్కశర్మకు జంతువులంటే ఎనలేని ప్రేమని మనకు తెలుసు. తనకు వీలునప్పుడల్లా పెటా తరఫున జంతు సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలూ చేపడుతుంటుంది. ఇటీవల తన బర్త్‌డే సందర్భంగా ఇందుకు సంబంధించిన ఓ నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే ముంబైకి వెలుపల జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని. అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని వివరించింది. #PAWsitive పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. ఇందుకు తన వంతు సహాయం చేస్తానని చెబుతున్నదీ బ్యూటీ. అనుష్క ఆలోచనకు ఎంతోమంది జంతు ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. కచ్చితంగా జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇదే కాకుండా మరో ప్రతిపాదననూ అనుష్క జంతుప్రేమికుల మందుకు తీసుకొచ్చింది. అదేంటంటే జంతువుల రక్తదానం. జంతువులను పెంచుకొనే వారు, ఆరోగ్యంగా ఉన్న తమ పెంపుడు జంతువుల నుంచి రక్తాన్ని దానంగా ఇవ్వాలని కోరుతున్నది అనుష్క. అలా రక్తాన్ని దానం ఇస్తే.. ప్రమాదంలో ఉన్న మరికొన్ని పెంపుడు జంతువులను కాపాడే వీలుంటుందని తన ఆలోచనను బయటపెట్టింది అనుష్క. ఆ ఆలోచన చేయడమే కాదు.. తన పెంపుడు కుక్క రక్తాన్ని దానం చేసి.. ప్రమాదంలో ఉన్న మరో కుక్క ప్రాణాలు కాపాడింది కూడా. ఇలా జంతువులపై తన ప్రేమను చాటుకుంటున్నది అనుష్కశర్మ.

689
Tags

More News

VIRAL NEWS