స్మార్టీ నవాజుద్దీన్!


Tue,May 15, 2018 11:33 PM

బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ తెలుసుగా? వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆయన అనతికాలంలోనే లక్షలాది మంది హృదయాల్ని గెలిచాడు. స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని అభిమానుల్ని సంపాదించాడు. అతడు ఎక్కడికెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా కేన్స్‌లోనూ మెరిశాడు నవాజ్.
Nawazuddin
నవాజుద్దీన్‌ను చూడగానే పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. అతడు మాట్లాడుతుంటే మన ఫ్రెండు మాట్లాడినట్లు అనిపిస్తుంది. తాజాగా అతడు కేన్స్‌లో మెరిశాడు. రసికా దుగ్యాల్‌తో అతడు షోలోకి ఎంటర్ కాగానే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. అభిమానులు, అక్కడకు వచ్చిన సినీ ప్రియులకు అభివాదం చెప్తూ నవాజ్ నడుస్తూ వెళ్తుంటే చూసేవాళ్లు వావ్ అనకమానలేదట. ఎందుకు అంటారా? సాదాసీదాగా కనిపించే అతడు కేన్స్ ఫెస్టివల్స్‌లో చాలా స్మార్ట్‌గా కనిపించాడు. అతడు మ్యాట్‌పై నడుస్తూ ఉంటే అందరూ స్మార్ట్ నవాజ్.. స్మార్ట్ నవాజ్ అంటూ కేకలు వేశారట. ఇక్కడ నవాజ్ సింప్లిసిటీ కూడా బయటపడింది. అదేంటంటే అతడు తన డ్రెస్‌లను లోకల్ టైలర్‌తో కుట్టిస్తాడు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వేసుకొచ్చిన సూట్స్ కూడా లోకల్ టైలర్ కుట్టినవే కావడం విశేషం. లోకల్ డ్రెస్‌లోనూ అంత స్మార్టీగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన నవాజ్ హూందాతనానికి అందరం ఫిదా అయ్యామని సెలబ్రిటీలు కితాబిచ్చారట.

536
Tags

More News

VIRAL NEWS

Featured Articles