చల్లదనపు ఫ్యాషన్!


Tue,May 15, 2018 11:33 PM

ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక పోతున్నాం. ఫంక్షన్లేమో ఈ ఎండలోనూ ఎక్కువగానే ఉంటున్నాయి. మరి ఈ ఉక్కపోతను తట్టుకోవడమెలా? ఎండాకాలంలోనూ చల్లదనం పొందడమెలా? బిగుతైన డ్రెస్‌లు ధరించే అలవాటున్న యువత చల్లని అనుభూతి పొందాలంటే ఎలాంటి డ్రెస్‌లు వేయాలి? ఈ విషయాలు తెలుసుకోండి!
Cold-Shoulder
సమ్మర్ స్పెషల్‌గా కొత్త రకం డ్రెస్‌లను తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. అందానికి అందం.. చల్లదనానికి చల్లదనం తీసుకొచ్చే ఆ ఫ్యాషన్ పేరు కోల్డ్ షోల్డర్. బెంగళూరు మోడల్స్ దీనిని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. 1950లో వస్త్రధారణనే మాడిఫై చేస్తూ కోల్డ్ షోల్డర్‌గా పునఃప్రారంభించారు. దీనిని వేసుకున్న కొద్దిసేపటికే శరీరమంతా చల్లబడి ఎండాకాలంలోనూ చల్లదనాన్ని ఇస్తుందట. ప్రసాద్ బిడపా అనే బెంగళూరు డిజైనర్ దీనిని ప్రదర్శించారు. రిచ్‌లుక్‌తో ఫ్యాషన్ డిజైనర్లను ఆకట్టుకోవడంతో ఈ ఫ్యాషన్‌ను అందరూ ఫాలో అవుతున్నారని డిజైనర్ చెప్తున్నారు. సమ్మర్‌లో తరుచూ కోల్డ్ షోల్డర్ ఫ్యాషన్‌తో ప్రదర్శనలిస్తున్నాననీ.. యువతకు ఇది మంచిగా యాప్ట్ అవుతుందని మోడల్ ఊర్వశి రౌతెలా అంటున్నారు. మండే ఎండలకు ఈ కూల్ ఫ్యాషన్‌ను ఫాలో అయితే బాగుంటుందని ఆమె సూచిస్తున్నారు.

592
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles