అంధుడైతేనేమి..!


Tue,May 15, 2018 11:32 PM

అతను ఎక్కడ జాబ్‌కోసం ఇంటర్వ్యూకు వెళ్లినా.. నీకు అన్ని అర్హతలున్నా అంధుడివి కాబట్టి ఉద్యోగమివ్వలేం అనే మాట వినబడుతుండేది. ఎవ్వరినో ప్రాధేయపడడం ఎందుకు.. అంటూ తాను తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఎంతోమందికి వెలుగునిస్తున్నది.
Pratheek-Agarwal
ఇతని పేరు ప్రతీక్ అగర్వాల్. జైపూర్‌కు చెందిన ప్రతీక్ పుట్టుకతోనే అంధుడు. దీంతో అతని తల్లి బ్రెయిలీ స్కూల్‌లో చేర్పించింది. అప్పటి నుంచి ఏది విన్నా మైండ్‌లో స్టోర్ చేసుకుంటాడు ప్రతీక్. ఆ తెలివితేటలతోనే స్కూల్, కాలేజ్ చదువుల్లో మంచి మార్కులు వచ్చాయి. నీమ్రానాలోని ఎన్‌ఐఐటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేశాడు. చదువు అయిన తర్వాత ఉద్యోగాల బాటపట్టిన ప్రతీక్‌కు ప్రతిచోటా అవమానమే జరిగింది. అన్ని అర్హతలున్నా అంధుడని ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో తనకున్న పరిజ్ఞానంతో కొత్తగా కంపెనీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు. డేడల్ టెక్నోవేషన్స్ పేరుతో కంపెనీని ప్రారంభించి సాఫ్ట్‌వేర్లు రూపొందించడం మొదలు పెట్టాడు. తానే సొంతంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ.. ఎంతో కష్టపడి అనతికాలంలోనే కంపెనీ వృద్ధికి పాటుపడ్డాడు. దీంతో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, వంటి దేశాల్లో క్లయింట్లను పెంచుకున్నాడు. ఉద్యోగం కావాలని కాళ్లరిగేలా తిరిగిన ప్రతీక్.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ.. ఓ శక్తిగా ఎదిగాడు.

743
Tags

More News

VIRAL NEWS