హత్తుకొనే లవోట్!


Wed,January 9, 2019 01:16 AM

బాధ కలిగినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తోడు ఉండాలనిపిస్తుంది. కానీ మనిషికి మనిషి తోడు ఉండడం అనేది ఈ కాలంలో జరుగని పనే అయింది. అందుకే ఆ లోటును భర్తీ చేయడానికి ఓ రోబో వచ్చేస్తున్నది.
lovot
చారెడంత కళ్లెసుకొని.. చిన్ని చేతులు, తలపై ఓ కెమెరాతో వస్తున్నదీ చిట్టి రోబో. దీనిపేరు లవోట్. లవ్ ప్లస్ రోబోట్‌ని కలిపి ముద్దుగా దీనికి ఆ నామకరణం చేశారు. ప్రేమను పంచేందుకు.. మీ ఒంటరితనాన్ని దూరం చేసేందుకు ఈ రోబోని కనిపెట్టారు. 16 అంగుళాల పొడవుతో ఉండే ఈ రోబో మొత్తానికి వెయ్యిమందిని గుర్తుపెట్టుకోగలదు. వంద ముఖాలను గుర్తించగలదు. మీరు బాధలో ఉంటే వచ్చి గట్టిగా హగ్ చేసుకుంటుంది. మిమ్మల్ని ఓదారుస్తుంది. ఇంకో విషయం.. ఇది మాట్లాడగలదు. కాకపోతే అది స్పష్టంగా మాత్రం ఉండదట. కింద ఉండే చక్రాలు గదులు తిరుగడానికి సహాయపడుతాయి. 16 గ్రాఫికల్ లేయర్స్‌తో వీటి కళ్లతో అందరినీ గమనించగలదు. 50 హై టెక్ సెన్సార్‌తో ఉండే ఈ లవోట్‌కి వై-ఫై కనెక్షన్ కూడా అవసరం లేదు. కేవలం ఒకసారి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తే చాలు. ఇంట్లో రెండు లేదా మూడు లవోట్స్ ఉంటే వాటికి సంబంధించిన విధులను కూడా అవే నిర్వర్తించుకోగలవు. వాటితో అప్పుడు మీకెలాంటి ఇబ్బంది కూడా తలెత్తదు. ఇప్పుడు జపాన్‌లో దొరికే ఈ లవోట్.. 2020 కల్లా యూఎస్, ఇతర దేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు దీన్ని తయారు చేసే కంపెనీ చెబుతున్నది. అదే కనుక జరిగితే ఒంటరితనానికి తోడుగా ఒక ప్రేమను పంచే రోబో దొరికినట్టే!

714
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles