త్వరలో విడుదల!


Tue,March 13, 2018 11:35 PM

Samsung
మార్కెట్లోకి ఏదైనా కొత్తఫోన్ విడుదలయితుందంటే.. మొబైల్ ప్రేమికులు దానికి సంబంధించిన వివరాలన్నీ కనుక్కుంటారు. విడుదల అయీ.. అవగానే కొనుక్కుంటారు. ఆకట్టుకునే ఫీచర్లు, అదిరిపోయే కెమెరా, కలర్‌ఫుల్ డిజైన్లు, ఎక్కువసేపు నిలిచి ఉండే బ్యాటరీలతో మొబైల్ కంపెనీలు కూడా సరికొత్త మోడల్స్‌ని ఎప్పటికప్పుడు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నెలాఖరి వరకు మార్కెట్లోకి విడుదలై హల్‌చల్ చేయనున్న కొన్ని హైఫై ఫోన్ల గురించే ఈ కథనం..


సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 ప్రీమియం


xperia-XZ1
డిస్‌ప్లే కాస్త చిన్నగా ఉన్నా.. పెర్ఫామెన్స్‌లో మాత్రం సోనీ ఫోన్లు ముందే ఉంటాయి. 4.6 ఇంచుల డిస్‌ప్లే, 1280 x 720 స్క్రీన్ రిజల్యూషన్‌తో రూపొందించిన ఈ మొబైల్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. 256 జీబీ వరకు మెమరీ కార్డు ద్వారా పెంచుకునే సామర్థ్యం కూడా ఉంది. 19 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా, 8.0 ఓరియో ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ మొబైల్ తయారుచేశారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, డ్యుయల్‌బాండ్ వైఫై, 5.0 బ్లూటూత్, టైప్ సీ యూఎస్‌బీ ఈ మొబైల్‌లో ఉన్న అదనపు ఫీచర్లు. 2700 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ. 34,900గా నిర్ణయించి ఈ మొబైల్‌ని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇవే ఫీచర్లతో సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 మొబైల్ కూడా రూపొందించారు. కాకపోతే ధరలో కాస్త అటూఇటూగా ఉండొచ్చు.

హువాయ్ పీ20 లైట్


huawei-p
హువాయ్ పీ 20 పేరుతో ఈ నెలాఖర్లో కొత్త మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 5.84 ఇంచుల ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 256 జీబీల వరకు పెంచుకోగల సామర్థ్యం ఈ మొబైల్‌లో అమర్చిన ప్రత్యేక ఫీచర్. 8.0 ఆండ్రాయిడ్ వర్షన్, 16, 2 మెగాపిక్సెల్స్, 16 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా అమర్చారు. 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రూపొందించిన ఈ మొబైల్ బ్లూ, బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉన్నది. ధర ఇంకా నిర్ణయించలేదు.

నోకియా 9


Nokia-9
అదిరిపోయే ఫీచర్లతో నోకియా త్వరలో ఓ కొత్త మోడల్ మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ఈ మొబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 5.3 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2560x1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో, 4/6/8 జీబీ ర్యామ్‌తో ఈ మొబైల్ రూపొందించారు. డ్యుయల్ సిమ్, 8.0 ఆండ్రాయిడ్ వర్షన్ ఈ మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి. వెనుకవైపు 13,8 మెగాపిక్సెల్స్ కెమెరాలు, 13 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 4జీ వోల్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5.0 వెర్షన్ బ్లూటూత్, టైప్ సి యూఎస్‌బీ పోర్ట్, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఇందులో అమర్చిన ఫీచర్లు. బ్యాటరీ గురించి చెప్పాలంటే ఎప్పట్లాగే అధిక సామర్థ్యంతో మొబైల్స్ విడుదల చేసే మొబైల్‌గా పేరున్న నోకియా ఈ మోడల్‌కి 3500 ఎంఏహెచ్ బ్యాటరీతో, ఫాస్ట్‌ఛార్జింగ్ ఫీచర్‌ను రూపొందించింది. ఈ నెలాఖర్లో విడుదల కానున్న ఈ మొబైల్ ధర రూ. 34,990

హువాయ్ పి11


Huawei
5.5 ఇంచుల డిస్‌ప్లే ఎల్‌సీడీ ప్యానెల్‌తో హువాయ్ పి11 మొబైల్ డిస్‌ప్లే రూపొందించారు. 2560x 1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 970 చిప్‌సెట్, 4/6జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8.0 ఓరియో ఆండ్రాయిడ్ వర్షన్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సెల్స్ రియర్ డ్యుయల్ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ లియాన్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ మొబైల్ రూపొందింది. ఈ నెల చివర్లో విడుదల కానున్న దీని ధర రూ. 38,000

ఎల్‌జీ వీ30ఎస్ థింక్యూ


thinku
6 ఇంచుల క్యూహెచ్‌డీ ప్లస్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో 2880 x 1440 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో ఈ మొబైల్ రూపొందించారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్లు ఇందులో అమర్చారు. 6 జీబీ ర్యామ్, 128/256 ఇంటర్నల్ స్టోరేజీ, 2 టీబీ వరకు పెంచుకోగల మెమరీ సామర్థ్యం. 8.0 ఓరియో ఆండ్రాయిడ్ వెర్షన్ ఈ మొబైల్‌లో అందుబాటులో ఉంది. 16,13 మెగాపిక్సెల్స్ డ్యుయల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా, వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, టైప్ సీ యూఎస్‌బీ పోర్ట్, వంటి అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి రానున్నది. 128 జీబీ వెర్షన్ ధర రూ. 63,000 256 వెర్షన్ ధర రూ. 66,000లకు అందుబాటులో ఉండనున్నది.

ఒప్పో ఆర్15 ఫీచర్లు


Oppo-r15
ఈ నెలాఖర్లో ఒప్పో ఆర్ 15 పేరుతో తన కొత్త మోడల్ మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 6.28 ఇంచుల డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో ఈ మొబైల్ రూపొందించారు. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 256 జీబీ వరకు మెమొరీని పెంచుకునే సామర్థ్యం కలదు. 8.1 ఆండ్రాయిడ్ వెర్షన్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16,5 మెగాపిక్సెల్స్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 20 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరాలు ఇందులో అమర్చారు. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్, డ్యుయల్ బాండ్ వైఫై, 5.0 బ్లూటూత్, టైప్ సీ యూఎస్‌బీ, 3365 బ్యాటరీ సామర్థ్యం కలదు. ధర ఇంకా నిర్ణయించలేదు.


ఎల్‌జీ జీ7


LG
మార్చిలోనే విడుదల అయిన ఈ మొబైల్ నోకియా 9 కంటే కాస్త పెద్దదైన డిస్‌ప్లేతో మార్కెట్లోకి రానుంది. 6.1 ఇంచుల ఫుల్‌విజన్ డిస్‌ప్లే, 1440x3120 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 845 ప్రాసెసర్లతో ఈ మొబైల్ రూపుదిద్దుకుంది. 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 8.1 ఆండ్రాయిడ్ వెర్షన్‌తో ఈ మొబైల్ తయారుచేశారు. ఇక కెమెరాల విషయానికొస్తే 16 మెగాపిక్సెల్స్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వోల్ట్, డ్యుయల్‌బాండ్ వైఫై, 5ఎల్‌ఈ వెర్షన్‌లో బ్లూటూత్, టైప్ సీ యూఎస్‌బీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి మొదలైన ఫీచర్లు ఈ మొబైల్ ప్రత్యేకతలు. వేగంగా, వైర్‌లెస్‌గా చార్జింగ్ చేసుకునే సదుపాయం ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్. మార్కెట్లోకి విడుదల చేయనున్న అంచనా ధర రూ. 59,900

417
Tags

More News

VIRAL NEWS

Featured Articles