నీళ్లు తాగించే యాప్స్


Tue,March 13, 2018 11:24 PM

రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల వరకు మంచినీళ్లు తాగమని డాక్టర్లు చెబుతారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని తాగామో గుర్తుండదు. పనిలో పడితే అసలు నీళ్లు తాగాలన్న విషయం కూడా మరిచిపోతారు కొంతమంది. అలాంటి వారికోసమే ఈ ఐదు యాప్‌లు.

WATER

వాటర్ లాగ్డ్ :

ఇది మీరు వాటర్ తాగాల్సిన టైం వచ్చినప్పుడు గుర్తు చేస్తుంది. సో మర్చిపోయే చాన్సే లేదన్నమాట. కాకపోతే మీరు నీళ్లు తాగిన ప్రతీసారి ఇందులో డిపాజిట్ చేయాలన్నమాట. ఇది మీరు వాటర్ తాగి ఎంతసేపవుతుందో అని కూడా రిమైండ్ చేసినప్పుడు నోటీస్ చేస్తుంది. యాప్‌స్టోర్‌లో ఈ యాప్‌ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్ అందరికీ సుపరిచతమే. మీరు ఒక రోజులో తాగిన మంచినీళ్ల శాతాన్ని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. వాటర్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఈ యాప్ చెప్తుంది. అంతేకాదు మీ శరీరానికి ఎంత నీరు కావాలి. మీరు ఇప్పటి వరకు ఎంత తాగారు అనే విషయాన్ని కూడా డిస్‌ప్లే చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

హైడ్రో కోచ్

మీ బాడీకి ఎంత నీరు అవసరం, ఉదయం నుంచి ఎన్ని నీరు తాగారు అనే ఖచ్చితమైన లెక్కలు తీసి చూపిస్తుందీ యాప్. వయసును బట్టి, ఆడ, మగ లింగ భేదాగన్ని బట్టి ఎవరికి ఎంత వాటర్ అవసరమో నోటీస్ చేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ ఫ్రీగా అందుబాటులో ఉంది. కావాలనుకుంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ప్లాంట్ నానీ

చిన్న చిన్న మొక్కలు మన దగ్గరికొచ్చి దాహంగా ఉంది మంచినీళ్లు పోయండి అని అడుగుతాయా ? అడుగవు. కానీ ఈ యాప్‌లో ఉండే చిన్న చిన్న మొక్కలు మీర నీరు తాగాల్సిన సమయం రాగానే అలారం వచ్చి మాకు దాహంగా ఉంది నీరు పోయండి అని అడుగుతాయి. మీరు ఒక్క గ్లాసు వాటర్ తాగి ఈ యాప్‌లో రిజిష్టర్ చేసుకుంటే సాయంత్రానికల్లా ఆ మొక్క పెరిగి చెట్టవుతుంది. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

1389
Tags

More News

VIRAL NEWS