మహా కంప్యూటర్


Tue,January 15, 2019 04:01 AM

ప్రపంచంలోనే మరే కంప్యూటర్‌కు సాధ్యపడనంత అత్యంత కచ్చితత్వంతో కూడిన మెదడు పని అనుకరణను తాజాగా స్పిన్‌నేకర్‌గా పిలిచే మరో సూపర్ కంప్యూటర్ సాధించింది. ఐతే, ఇది మనిషి మెదడు కొలమానంతో పోలిస్తే కేవలం ఒక శాతం మాత్రమేనని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు.
Aadhunika-Pokada
పది లక్షల ప్రాసెసింగ్ కోర్స్, 1,200 అంతర సంబంధాల సర్క్యుట్లతో మనిషి మెదడు ప్రేరణలను అత్యంత కచ్చితత్వంతో అనుకరించే మరో సూపర్ కంప్యూటర్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. స్పిన్‌నేకర్ (SpiNNaker: Spiking Neural Network Architecture) గా పిలిచే ఈ అద్భుత సూపర్ కంప్యూటర్ పవర్ హౌజ్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్ (యుఎన్)లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో ఉంది. పదేళ్ల కృషితో ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్‌గా దీనిని వారు రూపొందించారు. మెదడు నాడుల ఉత్తేజపు చర్యలను అనుకరించడంలో ఇప్పుడున్న అన్ని సూపర్ కంప్యూటర్లలో ఇదే అత్యంత ఘనమైందిగా చెబుతున్నారు. ఇది ఏకకాలంలో 200 క్వాడ్రిలియన్ చర్యలను నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు వారు చెప్పారు. అయినా, మనిషి మెదడు పనితనపు కొలమానాలతో పోల్చినప్పుడు దీని సామర్థ్యం కేవలం 1 శాతం మాత్రమేననీ వారంటున్నారు.


మనిషి మెదడులో సుమారు 100 బిలియన్ల న్యూరాన్లు ఏకకాలంలో ఉత్తేజితమవుతూ, వేలాది లక్షిత అవయవ ప్రదేశాలకు సమాచారాలను చేరవేస్తాయి. పూర్తి కచ్చితత్వంతో కూడిన అనుకరణ ప్రస్తుతానికి దీనితో సాధ్యం కాదని పై శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఇప్పటికి అత్యంతాధునాతన యంత్రంగా రూపొందిన స్పిన్‌నేకర్ ఇందులో అత్యల్ప సామర్థ్యాన్నే ప్రదర్శించగలిగినా, సాధించింది కూడా తక్కువదేమీ కాదని వారు అంటున్నారు. మనిషి మెదడులో 1,000 వంతులు చిన్నగా ఉండే చిట్టెలుక మెదడు పనితనపు అనుకరణకైతే ఇది సమానమని కూడా వారు తెలిపారు. 2016 నుంచీ స్పిన్‌నేకర్‌లో నాడీకణాల అనుకరణ చర్యను పూర్తి చేయడానికి 5,00,000 కోర్ ప్రాసెసర్లను వినియోగించామని, దీనిని 10,00,000లకు పెంచి ఫలితాన్ని సాధించినట్టు పై ప్రాజెక్ట్ సభ్యుడు స్టీవ్ ఫర్బర్ లైవ్ సైన్స్‌కు వెల్లడించారు.

575
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles