అతి ప్రాచీన వృక్ష విషక్రిమి


Tue,January 15, 2019 03:59 AM

Puravruksha-Shastram
సుమారు 1,000 సంవత్సరాల కిందటి అతి ప్రాచీనమైన మొక్కజొన్న కంకి అవశేషాలలో అంతే పురాతనమైన వృక్ష విషక్రిమి (ప్లాంట్ వైరస్) నొకదానిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కార్బన్-14 డేటింగ్ విధానంలో దానిని గుర్తించినట్టు వారు తెలిపారు.
అమెరికాలోని అరిజోనా రాష్ర్టానికి చెందిన అంటెలోప్ హౌజ్ వద్ద లభించిన అతిప్రాచీన (1,000 సం॥ల కిందటి) మొక్కజొన్న కంకి అవశేషాలలో ఇటీవల కనుగొన్న విషక్రిమిని జీ (Zea) గా పిలుస్తున్నారు. క్రిసోవిరిడా (Chrysoviridae) కుటుంబానికి చెందిన క్రిసోవైరస్-1 (chrysovirus 1) గానూ దీనిని వ్యవహరిస్తున్నారు. అక్కడి కాన్యోన్ డీ చెల్లీ నేషనల్ మానుమెంట్ పార్కు పరిధిలోని ఒక ప్రాచీన స్థానికుల నివాస ప్రాంతం (ఆనెస్ట్రల్ ప్యూబ్లోన్)లో 1970లలో జరిపిన తవ్వకాలలో లభ్యమైన పంటమొక్కలు, వృక్ష అవశేషాలలోంచి సేకరించిన పై మొక్కజొన్న కంకి తునకలపై ఆధునాతన పరిశోధనలు జరగ్గా, పై ఆవిష్కరణ వెలుగుచూసినట్టు చెబుతున్నారు. ఆ ప్రదేశంలోని స్థానిక ప్రజలు పండించిన పంటలలో మొక్కజొన్న, చిక్కుడు, స్కాష్ (ఒక రకమైన కూరగాయ) వంటివి ఉండగా, లభ్యమైన అవశేషాలలో కంకులు, ఆకులు, పొట్లు, కాండం ముక్కలు, ఎండు కుచ్చులు వంటివి ఉన్నాయి. చాలా అరుదుగా బయటపడే ఈ వైరస్ ఎక్కువగా పంటకు వ్యాధికాకరం కాదనీ వారు అంటున్నారు.

258
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles