విశ్వదర్శనం


Tue,January 15, 2019 03:58 AM

కొత్త సూపర్ స్టార్ ఆర్‌ఎస్ పప్పీస్ సూర్యునికంటే 200 రెట్లు పెద్దది, 15,000 రెట్లు అత్యధిక ప్రకాశాన్ని వెదజల్లుతున్న సూపర్ స్టార్‌ను హబుల్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. ఈ మహా నక్షత్ర వ్యవస్థ భూమికి సుమారు 6,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు నాసా వెల్లడించింది.
Vishwa-darshanam
దక్షిణాది ఆకాశంలోని సరికొత్త అద్భుత నీహారిక (నెబ్యులా)లో ఒక భారీస్థాయి నక్షత్ర వ్యవస్థను ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఆర్‌ఎస్ పప్పీస్ (RS Puppis) గా పిలుస్తున్న ఈ మహానక్షత్రాన్ని సెఫీడ్ (Cepheid) అస్థిర నక్షత్ర రకానికి చెందిన అతిపెద్ద కాంతి తారల్లో ఒకటిగా చెబుతున్నారు. గుండ్రని కాంతి పుష్పగుచ్ఛం వంటి నక్షత్ర సముచ్ఛయం నడుమ ఇది మిరుమిట్లు గొలుపుతూ ఉన్నదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ప్రకటించింది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అందించిన ఈ చిత్రంపై జరిపిన అధ్యయనంలో దీని మొత్తం ద్రవ్యరాశి మన సూర్యునికన్నా పదిరెట్లు ఎక్కువుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమికి సుమారు 6,500 కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని వున్న ఈ నక్షత్రం సూర్యునికంటే 200 రెట్లు పెద్దదే కాక 15,000 రెట్లను మించిన అత్యధిక ప్రకాశాన్ని విడుదల చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఆరు వారాల నిర్ణీత కాల వ్యవధితో ఇది కాంతి హెచ్చుతగ్గుల్ని సృష్టిస్తున్నట్టు వారు గుర్తించారు.

476
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles