పనితనం


Tue,January 15, 2019 03:57 AM

Sucharitha
కృత్రిమ ఉపగ్రహాల (సాటిలైట్స్)తో ఆధునిక మానవ జీవన శైలిలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. విశ్వవ్యాప్తమైన వీటి సేవలు ఇవాళ ఎంతగా అనివార్యమైనాయంటే అవి లేకపోతే రోజులు గడవని స్థితి. సాటిలైట్స్ పనితనం చూడటానికి ఎంత సులభమో, నిర్వహణలో ఒకింత సంక్లిష్టమే. టీవీ, కార్లు వంటి వాటిని రిమోట్ సహాయంతో నిర్వహించినంత తేలికే కావచ్చు. కానీ, దీనికి ఉపయోగపడుతున్న సాంకేతిక వ్యవస్థలు మనిషి వైజ్ఞానిక శక్తిని ప్రస్ఫుటం చేస్తున్నాయి. ఉపగ్రహాల పనితనం అంతా రేడియో తరంగాలపైనే ఆధారపడి ఉంటుంది. టీవీ రిమోట్‌కు, సెట్‌టాప్ బాక్స్‌కు మధ్య పరారుణ (infrared waves) కిరణాలు సమాచార మార్పిడి చేస్తే, ఫోన్ల నడుమ మైక్రోవేవ్స్ ఈ పనిని నిర్వహిస్తాయి. భవనాలు, పర్వతాలు వంటి అడ్డంకులను సుదూర తరంగ ధైర్ఘ్యంతో కూడిన రేడియో తరంగాలు సునాయసంగా దాటేసి వెళ్లగలవు. సమాచార ఉపగ్రహాలు అవసరాన్నిబట్టి రోదసీ ఉపగ్రహాల సేవలను కూడా వినియోగించుకుంటాయి.

473
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles