కొత్త రెక్కల రాక్షసబల్లి


Tue,January 8, 2019 01:24 AM

Purajeeva-Shastram
మధ్య జురాసిక్ శకానికి చెందిన కొత్త రెక్కల రాక్షసబల్లి శిలాజ అవశేషాలను ఇంగ్లాండ్‌లోని లుప్తజంతు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి రెక్కల వైశాల్యమే 6.5 అడుగుల మేర ఉండినట్టు వారు చెబుతున్నారు.


క్లోబియోడాన్ రోచీ (Klobiodon rochei) గా పిలిచే టెరోసార్స్ (pterosaurs) జాతి రాక్షసబల్లి శిలాజ అవశేషాలను ఇంగ్లాండ్‌కు చెందిన హ్యాంప్‌షైర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్ పరిశోధకులు ఇటీవల కనుగొన్నారు. ఇది పెద్ద రెక్కల సరీసృపమని, సుమారు 167 మిలియన్ సంవత్సరాల కిందట (మధ్య జురాసిక్ శకం) ఇవి నివసించి ఉంటాయని వారు భావిస్తున్నారు. సుమారు 6.5 అడుగుల (2 మీటర్లు) రెక్కల వైశాల్యంతో ఉన్న ఈ రాక్షసబల్లి శిలాజ అవశేషాలను ఆక్స్‌ఫర్డ్‌షైర్‌కు చెందిన స్టోన్స్‌ఫీల్డ్‌లోని టేంటన్ లైమ్‌స్టోన్ (సున్నపు రాయి) నిర్మాణాలలో కనుగొన్నట్లు వారు తెలిపారు. దీని కింది దవడ మాత్రమే వెలుగులోకి వచ్చిందని, సుమారు 1 అంగుళం (.2.6 సెం.మీ.) సైజు కోరల వంటి దంతాలు దీనికి ఉండి ఉంటాయని వారు తెలిపారు. చూడటానికి ఒక రకమై సముద్రపు కొంగను పోలి ఉండే ఈ టెరోసార్ రెక్కల రాక్షసబల్లి అవశేషాల ఆవిష్కరణ తాలూకు పరిశోధనా పత్రం ఆక్టా పాలియోంటొలాజికా పొలానికా (Acta Palaeontologica Polonica) జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది.

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles