గాలితో నడిచే కారు


Tue,January 8, 2019 01:23 AM

Aadhunika-Pokada
ఈజిప్టులోని ఇంజినీరింగ్ విద్యార్థులు గాలితో నడిచే కారు నమూనాను తయారుచేశారు. సంపీడన ప్రాణవాయువుతో నడిచే ఈ రకమైన వాహనాలతో కాలుష్యం నివారణవడమే కాక, ఇంధన ఖర్చు కూడా కలిసి వస్తుందని వారంటున్నారు.

ఒకే వ్యక్తి కూర్చుని ప్రయాణించడానికి అనువైన, కేవలం గాలితో మాత్రమే నడిచే కొత్త రకం కారును ఈజిప్టుకు చెందిన హెల్వన్ (Helwan) విశ్వవిద్యాలయానికి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు తమ ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు. చిన్న రేసింగ్ కారులాంటి ఈ వాహనాన్ని సంపీడన ప్రాణవాయువు (compressed oxygen) తో నడిపించారు. దీనిలో ఒక వ్యక్తి ప్రస్తుతానికి గంటకు 40 కి.మీ. వేగంతో ప్రయాణించ వచ్చునని, సుమారు 30 కి.మీ. మైలేజీకి ముందు తిరిగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు. సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధిలో భాగంగా దీనిని రూపొందించినట్లు వారు చెప్పారు.

ఈ కారును తయారు చేయడానికి సుమారు 18,000 ఈజిప్టియన్ పౌండ్లు (1,008.40 అమెరికన్ డాలర్లు) వ్యయం కాగలదని పై విద్యార్థులు వెల్లడించారు. కావలసిన మేర నిధులు సమకూర్చుకొని పెద్ద మొత్తంలో ఈ వాహనాల తయారీకి శ్రీకారం చుట్టగలమని కూడా వారు అంటున్నారు. గంటకు సుమారు 100 కి.మీ. వేగంతో, మరో 100 కి.మీ. మైలేజీకి ముందే గాలిని తిరిగి నింపుకోవాల్సిన రీతిలో దీని సాంకేతికతను మరింతగా మెరుగు పరుస్తామని వారు చెబుతున్నారు.

586
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles