కొత్త థాలియమ్ ఆవిష్కరణ


Tue,January 8, 2019 01:21 AM

Bhoovignaana-Shastram
అతి పురాతన కాలానికి చెందిన అగ్నిపర్వత ప్రదేశంలోని భూగర్భ ప్రాంతంలో భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం థాలియమ్ ఖనిజాన్ని కనుగొన్నారు. దీనిద్వారా భూగర్భ ఖనిజాల వెలికితీతకు సంబంధించి కొత్త విషయాలు తెలిసే అవకాశాలు ఉండగలవని వారు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన మెల్బోర్న్ నగరంలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నటాలియమలికైట్ (Nataliyamalikite) పేర్న పిలిచే కొత్త థాలియమ్ ఖనిజాన్ని ఒక అగ్నిపర్వత ప్రాంతంలో కనుగొన్నారు. స్ఫటిక వ్యవస్థలకు చెందిన ఆర్థోక్రాంబిక్ రూపంలోని థాలియమ్ ఐయోడైడ్ (TlI) గా వారు దీనిని గుర్తించారు. ఇది తీవ్ర విషతుల్య లక్షణంతో పేరెన్నికగన్న ఒక భార లోహం. రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతానికి చెందిన కాంచట్క పెనిన్సులా (Kamchatka Peninsula) ద్వీపకల్పంలో ఇది వెలుగులోకి వచ్చింది. అతిప్రాచీనమైన ట్రియాసిక్ (సుమారు 251-199 మిలియన్ సంవత్సరాల కిందటి) శకకాలంలో ఇది ఏర్పడి ఉంటుందని వారు భావిస్తున్నారు. కాంచట్క అవాచ (Avacha) అగ్నిపర్వతానికి చెందిన స్యూడో క్యూబిక్ నానోక్రిస్టల్స్ వల్ల ఈ ఖనిజం ఏర్పడి ఉంటుందని, భూమ్మీది అత్యంత శక్తివంతమైన అగ్నిపర్వతాలలో ఇదొకటని పై పరిశోధకుల బృందం నాయకుడు ప్రొ॥ బ్రగ్గర్ తెలిపారు. ఈ పరిశోధనా పత్రం అమెరికన్ మినరాలిజిస్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది.

190
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles