సుచరిత


Mon,January 7, 2019 11:19 PM

Sucharitha
అనూహ్య ఉష్ణసామర్థ్యాన్ని ప్రదర్శించే డీజిల్ ఇంజిన్ సంచలన చరిత్ర ఎంతో సుదీర్ఘం. ఇదే సమయంలో గత కొన్నేళ్లుగా దీనివల్ల వాతావరణంలోకి వచ్చి చేరుతున్న కాలుష్యకారక వాయువులు కలిగిస్తున్న పర్యావరణ నష్టమూ తక్కువదేమీ కాదు. ఒకవైపు ప్రతికూలత, మరోవైపు అనుకూలతల నడుమ ఈ అద్భుత యంత్రం అభివృద్ధి మాత్రం ఆగకుండా కొనసాగుతూనే ఉంది. తక్కువ శక్తి వినియోగంతో ఎక్కువ సామర్థ్యాన్ని పొందే లక్ష్యంతోనే ఈ ఇంజిన్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నారు. ఒకనాటి స్టీమ్ ఇంజిన్ స్థానంలో వచ్చిన డీజిల్ ఇంజిన్ ప్రాథమిక స్థాయిలో అసాధారణ చరిత్రనే సృష్టించింది. భారీ ట్రక్కులను లాగడానికి ఇది తప్ప మరో ప్రత్యామ్నాయం ఇప్పటికీ లేదు. క్రీ.శ. 1885లో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో రుడోల్ఫ్ డీజిల్ సృష్టించిన నమూనాతో వీటి యుగం ప్రారంభమైంది. 1960, 70లలో టర్బో డీజిల్ ఇంజిన్లు రోడ్లను ఏలాయి. ఇప్పటికి వీటి తయారీలో భారీ మార్పులే వచ్చాయి. ఉద్ఘారాల స్థాయిని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచుతూ ఆధునీకృతమవుతున్న డీజిల్ ఇంజిన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉన్నప్పటికినీ దీనికి దీటైన ప్రత్యామ్నాయం వచ్చే వరకు నువ్వే దిక్కు అనక తప్పని పరిస్థితే మరి.

352
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles