ఎలాగంటే?


Tue,January 8, 2019 01:17 AM

Elagante
నిద్ర మనుషులకే కాదు, దాదాపు అన్ని రకాల ప్రాణుల (క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు)కూ తప్పనిసరి. మంచి నిద్ర వల్ల దేహంలోని మెదడు సహా అన్ని అవయవాలూ పూర్తి విశ్రాంతిని పొందుతాయి. నిద్రతో మన శారీరక, మానసిక అలసటను తీర్చుకొని తిరిగి శక్తిని పుంజుకొంటాం. ముఖ్యంగా మస్తిష్కంలోని వ్యర్థాలు (అనవసర ఆలోచనలు) తొలగిపోతాయి. అభ్యాస, జ్ఞాపకశక్తులు మరింత బాగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. గుండె, మెదడు, జీర్ణక్రియ, కేంద్రనాడీ వ్యవస్థ వంటి అంతర అవయవ చర్యలన్నీ నిద్రించే వేళ కూడా యథావిథిగా పనిచేస్తూనే, కొంత నెమ్మదిస్తాయని శాస్త్రజ్ఞులు అంటారు. మెదడులోని సంబంధిత కేంద్రం ప్రేరేపితమైనపుడు నిద్ర వస్తుంది. నిద్రించే సమయంలో మెదడు మేల్కొని ఉన్నప్పటికంటే కొంత తక్కువ శక్తిని వినియోగించుకుంటుందని వారు అంటారు. కండరాలైతే చలనరహితంగా ఉంటాయి.

478
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles