పనితనం


Tue,January 8, 2019 01:16 AM

panitanam
కెమెరా ఒక దృశ్య సంబంధమైన పరికరం. తొలుత స్టిల్ కెమెరాతో ఫొటోలు చిత్రీకరించి ఫిల్మ్‌లో ప్రాసెస్ చేసుకొని ప్రింట్ వేసే వారు. డిజిటల్ యుగం ఆరంభమైనాక చాలావరకు ఫొటోగ్రఫీ ఇందులోకి మారింది. సెల్ కెమెరాలతోపాటు డిజిటల్ కెమెరాలూ వచ్చాయి. కెమెరా పనితనం మానవ నేత్రాన్ని పోలి ఉంటుంది. దాదాపు అన్ని రకాల కెమెరాలూ ఒకే విధమైన ప్రాథమిక రూపకల్పనతోనే ఉంటాయి. కనిపించే కాంతి పరావర్తనం ఆధారంగానే ఇది పనిచేస్తుంది. స్టిల్ కెమెరా ఒక వస్తువుకు సంబంధించిన చిత్రాలను ఫొటోగ్రఫిక్ ఫిల్మ్ లేదా ఎలక్ట్రానిక్ సెన్సర్లపై చిత్రీకరిస్తుంది. ఇందులోని కాన్వెక్స్ (కుంభాకార) కటకం, ఇతర లెన్సుల ద్వారా ఛాయాచిత్ర చిత్రీకరణ జరుగుతుంది. కాగా, తొలి శాశ్వత ఛాయాచిత్రాన్ని క్రీ.శ. 1825లో ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్ నైసెఫోర్ నీప్స్ (Joseph Nicephore Niepce) చిత్రీకరించారు.

322
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles