13 యేండ్లకే సాఫ్ట్‌వేర్ కంపెనీ!


Sun,January 13, 2019 12:20 AM

స్కూల్ ఎప్పడు అయిపోతుందా అని కొంతమంది చూస్తుంటారు. ఇంటికి వెళ్లగానే తిని ఏ ఆట ఆడుదాం అని ఇంకొంతమంది ఆలోచిస్తారు. కానీ ఈ అబ్బాయి ఏకంగా సాఫ్ట్‌వేర్ కంపెనీనే ప్రారంభించాడు.
allari
ఇతని పేరు ఆదిత్యన్ రాజేష్.. వయసు 13 యేండ్లు. సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించాడు. కంపెనీ స్థాపించాలంటే యజమానికి కనీసం 18 యేండ్లు నిండి ఉండాలి. అంత వయసు లేకపోయినా ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే 12 మంది క్లయింట్స్ ఉన్నారు. ప్రస్తుతం డిజైనింగ్, కోడింగ్ సేవల్ని వారికి ఉచితంగా అందిస్తున్నారు. ట్రైనెట్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రారంభించిన ఆదిత్యకు చిన్నప్పటి నుంచీ టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. దాంతో కంపెనీల లోగోలు, వెబ్‌సైట్స్ క్రియేట్ చేసేవాడు. తొమ్మిదేండ్ల వయసులో తొలి మొబైల్ అప్లికేషన్‌ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆదిత్య కేరళలోని తిరువిల్లాలో పుట్డాడు. ఐదేండ్లు ఉన్నప్పుడు ఆదిత్య కుటుంబం కేరళ నుంచి దుబాయ్‌కి మారింది. అదే సమయంలో బీబీసి టైపింగ్ అనే వెబ్‌సైట్ గురించి తన తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. ఇది చిన్నారులు టైపింగ్ నేర్చుకోవడానికి ఉపయోగపడే సులువైన వెబ్‌సైట్. అలా టైపింగ్.. ఆ తర్వాత ఇంటర్నెట్‌ని నేర్చుకొని ఒక కంపెనీనే ప్రారంభించే స్థాయికి ఎదిగాడు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్యన్ చెబుతున్నాడు.

448
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles