56 భాషలు మాట్లాడతాడు!


Sun,January 13, 2019 12:33 AM

మూడు నాలుగు భాషల్లో మాట్లాడాలంటేనే నానా హైరానా పడుతుంటారు కొంతమంది. అలాంటిది ఈయన మాత్రం ఏకంగా 56 భాషలను మాట్లాడగలడు ఎక్కడా గుక్క తిప్పుకోకుండా. ఇన్ని భాషలు ఎలా నేర్చుకున్నాడో అనేగా మీ సందేహం. యూట్యూబ్ ద్వారానే అది సాధ్యమైందని చెబుతున్నాడు మహమ్మద్ మెసిక్.
Mohemmad-Messik
టెజ్లాకు చెందిన మహమ్మద్ అసాధారణ ప్రతిభను చూసి అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. చాలా మంది ఒక కొత్త భాషను నేర్చుకోవటానికే కిందా మీదా పడుతుంటారు. అలాంటిది మహమ్మద్ మెసిక్ మాత్రం ఏకంగా 56 భాషలను టకటకా ఎటువంటి పాజ్‌లు లేకుండా మాట్లాడేయగలడు. ఉపన్యాసాలు దంచేయగలడు. అలాగే 70 దాకా భాషలను అర్థం చేసుకోగలడు కూడా. చిన్నతనంలోనే, అంటే ఐదేండ్ల వయసులోనే అతను టూర్‌కి వెళ్లిన ప్రాంతానికి చెందిన భాషను నేర్చుకుని తల్లిదండ్రులను అబ్బురపరిచాడు. ఆ తరువాత కొత్త భాషలను నేర్చుకోవడం అతనికి అలవాటుగా మారింది. దాంతో తల్లిదండ్రులు అతణ్ని వైద్యునికి చూపించగా అతనికి ఉన్న ఆటిజమే బహుభాషాకోవిదుడుగా మారడానికి తోడ్పడిందని చెప్పారు. మరి ఇతను అన్ని భాషలనూ స్వయంగా వినే నేర్చుకోలేదు. ఆన్‌లైన్‌లో, యూట్యూబ్, పుస్తకాలు, కార్టూన్ల ద్వారా మహమ్మద్ కొన్ని కొత్త భాషలను నేర్చుకున్నాడంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు.

750
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles