ఫిట్‌నెస్‌తో వచ్చేందుకు!


Sat,January 5, 2019 11:04 PM

ఈ కొత్త ఏడాది రిజల్యూషన్‌లో ఫిట్‌నెస్ ఉందా? మీకు స్ఫూర్తి కలిగించే వారి కోసం వెతుకుతున్నారా? అయితే బాలీవుడ్ సుందరి దీపిక పదుకొనె చేస్తున్న ఈ వర్కౌట్ వీడియోను చూడండి. వావ్ దీపికా.. అనకుండా ఉండలేరు.
deepika-padukone
మూవీ సెలబ్రిటీలు ఫిట్‌నెస్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఎంత తింటున్నాం.. ఎంత కొవ్వుని కరిగిస్తున్నామని లెక్కలు వేసుకుంటూ రోజూ గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంటారు. తమ ఫిట్‌నెస్‌ను చాటుకోవడంతో పాటు ఫ్యాన్స్‌లోనూ స్ఫూర్తిని రగిలించేలా సోషల్‌మీడియాలో తమ వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. తమ అభిమాన తారల అందాల వెనుక ఇంత కష్టం ఉందన్న విషయం ఈ వర్కౌట్స్ ద్వారానే వారి ఫ్యాన్స్‌కు తెలుస్తుంది. ఇటీవల పెండ్లి చేసుకున్న దీపిక లేటెస్ట్‌గా కపిల్ శర్మ వివాహ రిసెప్షన్, జోయ అక్తర్ క్రిస్మస్ పార్టీలో తళుక్కుమంది. పెండ్లి, పార్టీలతో కాస్త బరువెక్కిందో ఏమోకానీ ఇప్పుడు ఎక్స్‌ట్రా క్యాలరీలను కరిగించే పనిలో పడింది.
deepika-padukone2
తన కొత్త వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలో దీపిక మెట్లు వేగంగా ఎక్కుతూ, దిగుతూ వర్కౌట్స్ చేస్తుంది. తన పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నమ్ పర్యవేక్షణలో దీపిక ఈ వర్కౌట్స్ చేస్తుంది. ఇందులో దీపిక పదుకొనె వేగం, సామర్థ్యాన్ని ఆమె ఫ్యాన్స్ తెగమెచ్చుకుంటున్నారు. దీపిక వర్కౌట్ వీడియో చూస్తే.. కొత్త సంవత్సరంలోనైనా ఫిట్‌నెస్‌పై కాస్త ఎక్కువ ధ్యాసపెట్టాలన్న స్ఫూర్తి అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

704
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles