అభిమానం కాదు అంతకు మించి!


Sat,January 5, 2019 11:03 PM

ఓ ఇంటిరియర్ డిజైనర్ తన శరీరమంతా టాటూలు వేయించుకుని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. టాటూలు అంటే మామూలు టాటూలు కాదు. భారత ఆర్మీలో అమరులైన వీర జవాన్ల పేర్లు అవి. వాటితో పాటుగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అసువులు బాసిన పోరాట యోధుల ఫొటోలూ వేయించుకున్నాడు.
tatto
కశ్మీర్‌కు చెందిన గౌతమ్ చౌదరి అనే వ్యక్తి తన శరీరంపై 593 టాటూలు వేయించుకున్నాడు. అందులో 560 కార్గిల్‌లో మృతి చెందిన వారి పేర్లు. మిగతావి స్వాతంత్య్ర సమర యోధుల పేర్లు. ఎవరైనా అభిమానాన్ని చాటుకోవడానికి పేరును టాటూగా వేయిస్తారు. కానీ, గౌతమ్‌ది అభిమానం కాదు.. అది తన దేశభక్తి. అదే అమరులకు అర్పించే నివాళి అంటాడు. ఇలా టాటూలు వెయించుకోవడానికి తనకు ఎనిమిది రోజులు పట్టిందట. రోజుకూ ఆరు గంటలు కష్టపడ్డాడు. దీని కోసం డాక్టర్ సలహా కూడా తీసుకుని టాటూలు వేయించుకున్నాడు. అయితే ఇంతలా తన దేశభక్తి చాటుకోవడానికి కారణాలేంటని అడిగితే.. ఒక రోజు కశ్మీర్‌లోని లడఖ్ జిల్లాలో మిత్రులతో కలిసి పర్యటిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందట. ఈ ప్రమాదంలో అతని మిత్రుడ్ణి అక్కడున్న జవాన్లు రక్షించారనీ చెప్తున్నాడు. అలాగే మన కోసం సైనికులు ఉన్నారు, మనల్ని ఎల్లప్పుడూ రక్షించడానికి వారు విధుల్లో కష్టపడుతున్నారు అంటూ వాళ్లకోసం ఏదైనా చేయాలనుకున్నాడు. జవాన్ల గొప్పతనం తెలుసుకొని ఇలా తన నివాళిని అర్పించాడు గౌతమ్. నిజానికి దేశభక్తి అంటే జనవరి 26న, ఆగస్టు15న, పాకిస్తాన్-ఇండియా మ్యాచ్‌లో ప్రదర్శించేది కాదు. అది నిరంతరం ఉండాలి. ఈ టాటూల వల్ల నా దేశభక్తిని, దేశంపట్ల నా కర్తవ్యాన్ని రోజూ గుర్తు చేసుకుంటాను అంటున్నాడు గౌతమ్.

838
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles