అలెర్జీ ఎవరిలో ఎక్కువ?


Tue,January 15, 2019 01:40 AM

Allergies
ఈమధ్య అలెర్జీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కొందరికి వాతావరణం వల్ల, మరికొందరికి తిండి వల్ల రకరకాలుగా ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే చిన్నారుల కన్నా వయోజనుల్లోనే ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెప్తున్నారు.


అమెరికాకు చెందిన నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ తాజాగా అలెర్జీ సమస్యలపై అధ్యయనం జరిపింది. వాతావరణ మార్పుల వల్ల పిల్లలకు అలెర్జీలు ఏర్పడుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. అయితే ఆహారం, ఇతరత్రా అలెర్జీలకు సంబంధించిన సమస్యలు చిన్న పిల్లల్లో కంటే వయోజనుల్లోనే ఎక్కువగా ఉంటున్నట్లు వారు తెలిపారు. సుమారు 40,000 మందిపై అధ్యయనం చేశారు. వారిలో 10.8% మంది ఫుడ్ అలెర్జీతో బాధపడుతున్నట్లు తేలింది. 8.2% మంది ఇతర కారణాల వల్ల అలెర్జీల బారిన పడ్డారన్నారు. వీరిలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు 48% ఉన్నట్లు వారు గుర్తించారు. కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలెర్జీల వల్ల ఇతర అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉన్నందున ఎప్పటికప్పుడు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకుంటూ వీటి బారిన పడకుండా చూసుకోవాలంటున్నారు.

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles