రైతుల కోసం యాప్..


Mon,January 7, 2019 12:39 AM

మొక్కలు నాటడమంటే చాలామందికి ఇష్టంగా ఉంటుంది. కానీ, నాటిన తర్వాత ఎలా పెంచాలి? వాటి రక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏ రకం భూమిలో ఎలాంటి మొక్కలు పెట్టాలి? వంటి ప్రశ్నలకు చాలామందికి సమాధానం తెలియదు. అలాంటి వారికోసమే ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ట్రీపిడియా అనే యాప్‌ను తయారుచేయించారు.
sudha-app
తమిళనాడుకు చెందిన ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారిణి సుధారామన్ మొక్కలు నాటాలన్న తపన ఉన్న వారి కోసం ట్రీపిడియా అనే యాప్‌ను రూపొందించింది. గూగుల్‌లో మనకు ఎలాంటి సమాచారమైనా అందించే వికీపీడియాలాగ ఇది చెట్లు, మొక్కలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించే యాప్ అన్నమాట. తమిళనాడులో మొక్కలు నాటడం, వాటిని పెంచడం పట్ల చాలామందికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందట. కానీ వాటి ఎదుగుదల విషయంలో సరైన అవగాహన లేక మధ్యలోనే వదిలేస్తున్నారట. దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితుల మీద కూడా అవగాహన లేకపోవడం మరో కారణం. దీన్ని చాలా సార్లు గమనించిన సుధారామన్ చక్కని పరిష్కారం ఆలోచించింది. బయో ఇంజినీరింగ్ చదివిన సుధారామన్ మొక్క నాటడం మొదలుకొని చెట్టులా ఎదిగే వరకు పూర్తి సమాచారాన్ని ఒకేచోట చేర్చి ఔత్సాహికులకు అందించాలనుకుంది. ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనుకున్న లక్ష్యంతో చదివిన సుధారామన్ తన లక్ష్యాన్ని చేరుకొని తను పనిచేసే ప్రాంతాన్ని పచ్చగా చేయాలన్న ఆలోచనకు ఈ ఐడియా తోడయింది. వెంటనే ట్రీపిడియా అనే యాప్‌ను రూపొందించింది. డెహ్రడూన్‌లో అటవీ వనరుల గురించి చేసిన అధ్యయనంలో గోల్డ్ మెడల్ పొందిన సుధారామన్ యాప్‌ను అందరికీ అర్థమయ్యేలా తీర్చి దిద్దగలిగింది. రైతులు, సామాన్య జనాలు కూడా మొక్కల సంరక్షణ, పెంపుదల, నేలల రకాలు, ఏయే నేలల్లో ఎలాంటి మొక్కలు నాటాలన్న పూర్తి సమాచారం ఆ యాప్‌లో పొందుపరిచింది. యూత్, సోషల్ మీడియా ద్వారా ఆ యాప్‌కి ప్రచారం కల్పించింది. అంతే.. తమిళనాడులో ట్రీపిడియా యాప్‌కి అనూహ్యస్పందన వస్తున్నది. సుధా రామన్ ఆలోచన గురించి తెలిసిన వారంతా శభాష్.. ఫారెస్ట్ ఆఫీసర్ సుధారామన్ అంటున్నారు.

879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles