శీతాకాలంలో చర్మ సంరక్షణ!


Mon,January 7, 2019 12:37 AM

చలికాలంలో చాలామందికి చర్మం పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై మంట, దురద పెట్టడంలాంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇంట్లో లభించే పదార్థాలతోనే చర్మాన్ని మృదువుగా మార్చుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
skincare
-ముల్తానీ మట్టి, మీగడ, తేనె, బాదంనూనె వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా కాంతివంతంగా మారుతుంది.
-తేనె చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. స్నానం చేయడానికి మందు మీ శరీరానికి తేనెను ఐప్లె చేయాలి. 10 నిమిషాల తరువాత స్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ఇందులో యాంటీ మైక్రోబైల్, హ్యుమెక్టా లక్షణాలుంటాయి.
-తాజా పెరుగును కాళ్లకు, చేతులకు రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 15 నిమిషాల తరువాత స్నానం చేయాలి. పెరుగు పొడిచర్మాన్ని తొలిగిస్తుంది. రోజుకి ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది. పెరుగులో క్రిములను నాశనం చేసే ల్యాక్టిక్ యాసిడ్‌లుంటాయి.
-కలబందని ముక్కలుగా చేసి అందులోని గుజ్జును బయటకు తీయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. రోజుకు రెండుసార్లు చేయడం వల్ల చర్మంపై దురద తగ్గి, మృదువుగా ఉంటుంది. కలబందలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

776
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles