ఈ చిన్నారికి 336 నెలలు!


Mon,January 7, 2019 12:33 AM

ఎవరైనా వయసు అడిగితే.. సంవత్సరాల్లో చెబుతాం. అయితే కాలిఫోర్నియాలోని నాష్‌విల్లేకు చెందిన ఈ అమ్మడిని వయసు అడిగితే 336 నెలలు అంటున్నది. ఇందులో కన్‌ఫ్యూజన్ ఏం లేదు. తన 28వ పుట్టినరోజుని కొత్తగా జరుపుకునేందుకు ఇలా నెలల పాపగా మారిపోయింది.
small-baby
పుట్టినరోజంటే ఫ్రెండ్స్‌కి పార్టీలు, కేక్ కటింగులు ఉంటాయి. చుట్టాలందరినీ పిలిచి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు కొందరు. 27 యేండ్ల నికోల్ హామ్ మాత్రం తన 28వ పుట్టినరోజుని ఇప్పటివరకు ఎవరూ జరుపుకోని విధంగా జరుపుకోవాలనుకున్నది. తను పుట్టినప్పుడు ఎలా అయితే ఉన్నదో అచ్చు అలానే తయారవ్వాలనుకున్నది. దానికి తన ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్ స్టెఫానీ స్మిత్ సాయం కోరింది. ఇంకేముంది.. ఏర్పాట్లు సిద్ధం. పుట్టినరోజు రానే వచ్చింది. చంటిబిడ్డలా డ్రస్ ధరించి బెడ్‌పై పడుకొని ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది నికోల్. తలకి అందమైన పువ్వుని డెకరేట్ చేశారు. ఆమె చుట్టూ పచ్చరంగులో ఉండే తీగలతో అలంకరించారు. తన గురించి మూడు వాక్యాల్లో చిన్న బోర్డు మీద రాసి నికోల్ పక్కనే పెట్టారు. ఫొటోషూట్ అనంతరం వాటిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది నికోల్. నా 28వ పుట్టినరోజుకి నేను చంటిబిడ్డలా మారిపోయానని నికోల్ షేర్ చేసింది. పెట్టిపెట్టగానే కొద్దినిమిషాల్లోనే 25 వేల కంటే ఎక్కువమంది ఈ పోస్ట్‌ని షేర్ చేశారు. పోస్ట్ చూసిన చాలామంది చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా వారు చిన్న వయసులో ఎలా ఉన్నారో ఆ ఫొటోలనూ షేర్ చేస్తున్నారు. ఈ విధంగా నికోల్ తన పుట్టినరోజుని కొత్తగా జరుపుకున్నది.

742
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles