పిల్లలకు రక్షణ కావాలి!


Sun,April 15, 2018 11:21 PM

మానవత్వాన్ని మంటగలుపుతూ చిన్న పిల్లలపై, మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి తగిన శాస్తి జరగాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. కళ్లు మూసుకుపోయి ప్రవర్తించిన వాళ్లకు కచ్చితమైన శిక్ష పడాల్సిందేనని ముక్త కంఠంతో నినదిస్తున్నారు. సెలబ్రిటీలు, నెటిజన్లు ఒక అడుగు ముందుకేసి ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.
JusticeForChild
కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలు అందర్నీ కలచి వేస్తున్నాయి. మహిళలకు భద్రత కల్పిస్తున్నామని ఉపన్యాసాలిస్తుంటారేగానీ ప్రాక్టికల్‌గా అలాంటివి ఆచరణలోకి రావడం లేదని సెలబ్రిటీలు, నెటిజన్లు వాపోతున్నారు. సోషల్‌మీడియా వేదికగా #JusticeFor OurChild క్యాంపెయిన్ నిర్వహించి అందర్నీ ఏకం చేస్తున్నారు. ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా సెలబ్రిటీలు కూడా తమ గళం వినిపిస్తున్నారు. పిల్లలకు రక్షణ కల్పించాల్సిందేనని నినదిస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ వేదికగా వేలాది సందేశాలు పంపుతూ అత్యాచార బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. మానవత్వానికి మించిన మతం, కులం ఏదీ లేదని, ఈ వరుస ఘటనలు మానవత్వానికే మచ్చ తెచ్చాయంటున్నారు. సోనమ్‌కపూర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నేను సిగ్గు పడుతున్నాను. హిందువుగా బాధపడుతున్నాను. ఏ పాపం తెలియని ఓ చిన్నారిపై గుడిలో అత్యాచారం చేయడం మానవత్వాన్ని అత్యాచారం చేయడమే అన్నది. సోనమ్‌తో పాటు రోహిత్ చతుర్వేది, శృతి సేథ్, నమిష్ తనేజా, గుల్ పనాగ్ వంటివారు వందల మంది సెలబ్రిటీలు నెటిజన్లతో గొంతు కలిపారు.

627
Tags

More News

VIRAL NEWS